రెండోసారి తాతైన ముకేశ్ అంబానీ..

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.

2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు చేసుకున్న హడావుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం తెలిసిందే. మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టగా.. రెండోకాన్పులో అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మొదటి సంతానం 2020 డిసెంబరులో అబ్బాయి పుట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో బేబీ బంప్ తో శ్లోకా కనిపించారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమె గర్భవతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ది వినాయక ఆలయాన్నిదర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన పెద్ద కుమారుడికి రెండో సంతానంగా అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.