కారణం ఏదైనా కావొచ్చు.. స్మోక్ చేసే అలవాటు ఉందా? అయితే.. కరోనా ముప్పు ఉన్నట్లేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గజగజ వణికేలా చేస్తున్న కరోనాకు స్మోక్ చేసే వారంటే చాలా ఇష్టమని చెబుతున్నారు.
మామూలు వారితో పోలిస్తే.. స్మోక్ చేసే అలవాటు ఉన్న వారికి కరోనా ముప్పు 14 రెట్లు అదనమని లెక్కలు చెబుతున్నారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందికి పరిశోధనలు చేసిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన అధ్యయన రిపోర్టులను తాజాగా హెల్త్ జనరల్స్ లో ప్రచురిస్తున్నారు.
స్మోక్ చేసే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో కరోనా వ్యాప్తి చాలా త్వరగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా సోకితే ఛాతీ.. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు. దీంతో.. శ్వాస తీసుకోవటంలో కష్టం కావటమే కాదు.. కరోనా ముప్పు ఎక్కువే అంటున్నారు. అందుకే.. ఇప్పడున్న పరిస్థితుల్లో స్మోక్ చేసే అలవాటు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు.
స్మోక్ చేసే అలవాటుతో పాటు.. ఒకే సిగిరెట్ ను ఇద్దరు.. ముగ్గురు పంచుకునే అలవాటును తక్షణమే వదిలేయాలని చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తులైన గుట్కా.. జర్దాలు తిని రోడ్ల మీద ఉమ్మివేసే ఘటనలు ఉత్తరాదిన ఎక్కువని.. కరోనా వేళ.. అలాంటి అలవాట్లను వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఈ కారణం వల్లే అక్కడ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సో.. సిగిరెట్.. తాగే అలవాటు ఉంటే కేర్ ఫుల్ గా ఉండాల్సిందే.
స్మోక్ చేసే అలవాటు ఉందా? కరోనా ముప్పు ఎంత ఎక్కువంటే?
Gulte Telugu Telugu Political and Movie News Updates