దక్షిణాదిన పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో సూర్య ముందు వరసలో ఉంటాడు. గజిని సహా ఎన్నో సినిమాల్లో సూర్య తన పాత్రల కోసం నమ్మశక్యం కాని మేకోవర్లతో కనిపించాడు. సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనూ సూర్య రకరకాల అవతారాల్లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో సూర్య లుక్ ఏదీ బయటికి రాలేదు.
తాజాగా కొడైకెనాల్‌లో కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న సందర్భంగా సూర్య ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో గడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు సూర్య. సడెన్‌గా చూస్తే అది సూర్యనే అని కనిపెట్టడం కష్టమయ్యేలా ఉంది తన లుక్. దీన్ని బట్టి సినిమాలో సూర్య లుక్ ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వస్తున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రానికి తమిళంలో కంగువ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇంకా తెలుగు టైటిల్ ప్రకటించలేదు. అజిత్‌తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్‌తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి.
ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on May 11, 2023 8:05 am
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…