Political News

ఒకేసారి 2 స‌మ‌స్య‌లు.. చంద్ర‌బాబు సీరియ‌స్ డెసిష‌న్‌!

ఏపీలో ఒకేసారి రెండు కీల‌క స‌మ‌స్య‌లు రాష్ట్రంలో అల‌జ‌డి రేపుతున్నాయి. ఈ రెండు కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు కావ‌డం.. దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌త్యర్థులు విమ‌ర్శ‌లు చేస్తున్న క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ డెసిష‌న్ తీసుకున్నారు. అధికారులు క‌ద‌ల‌క‌పోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఏం జ‌రిగింది?

1) ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో డ‌యేరియా సంభ‌వించింది. దీంతో ప‌లువురు అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో గ‌త నాలుగు రోజుల్లో ఇద్ద‌రు మృతి చెందారు. ప్ర‌స్తుతం ప‌దుల సంఖ్య‌లో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ను ఇప్ప‌టికే తీవ్రంగా తీసుకున్న ప్ర‌భుత్వం శ్రీకాకుళం మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుంచి త‌ప్పించింది. హుటాహుటిన మంత్రుల బృందాన్ని కూడా అక్క‌డ‌కు పంపించి.. రోగుల‌ను ఆదుకునే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

2) తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో వెలుగు చూసిన క‌ల్తీ పాల ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. అనేక మందిలో కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా గుర్తించారు. ఈ ఘ‌ట‌న కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. పాల త‌యారీ దారుల వివ‌రాల‌ను సేక‌రించ‌డంతోపాటు.. నాణ్య‌త ప్ర‌మాణాల‌ను కూడా ప‌రిశీలించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. మ‌రోవైపు.. బాధిత కుటుంబాల‌కు.. 10 ల‌క్ష‌ల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా ప్ర‌క‌టించింది.

సీఎం సీరియ‌స్‌!

ఈ రెండు జిల్లాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఆయా జిల్లాల అధికారుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. కానీ, వారు తూతూ మంత్రం అన్న‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు.

దీనిపై గురువారం రాత్రి స‌మీక్షించిన సీఎం.. సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకున్నారు. “మీరు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తారా? లేక నేనే రంగంలోకి దిగాలా?“ అని ప్ర‌శ్నించారు. అధికారులు సరిగా స్పందించ‌ని ప‌క్షంలో తానే స్వ‌యంగా గ్రౌండ్ లెవిల్లో ప‌ర్య‌టించాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on February 26, 2026 11:36 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

11 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

11 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

11 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

13 hours ago