కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తాము ఎదగడమే ముఖ్యమని భావిస్తున్న నాయకులు కొందరు టీడీపీలో చర్చకు వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో 25 ఏళ్లుగా ఒకే నాయకుడు పాతుకుపోయారు. ఆయనపై ఆరోపణలు కూడా తక్కువేమీ లేవు. అయినా.. ఆయన తప్ప ఇంకెవరూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని షరతు విధించారు.
ఇక, విజయవాడలోని ఓ కీలక నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ వరుస విజయాలు దక్కిం చుకోకపోయినా.. గత ఎన్నికల్లో సదరు ఫైర్ బ్రాండ్ నాయకుడు విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు భారీ స్కోప్ ఉంది. నాయకులు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ, సదరు ఎమ్మెల్యే మాత్రం లక్ష్మణ రేఖలు గీశారు. ఏం చేసినా.. తనకు తెలియాల్సిందేనని షరతు విధించారు. దీంతో నాయకులు ఎదగలేక.. ఎమ్మెల్యే చెప్పినట్టే వింటున్నారు.
ఇలాంటి చర్యల వల్ల పార్టీ పురోగతికి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నా.. సదరు నేత మాత్రం వినిపించుకోవడం లేదు. ఇక, అనంతపురంలో ఎమ్మెల్యే ఒకరు అయితే.. చక్రం తిప్పుతోంది.. మరొకరు అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురంలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సమస్య జోరుగా వినిపి స్తోంది. దీంతో పార్టీలో ఔత్సాహిక యువత ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సీనియర్లు సరే.. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలని పార్టీ చెబుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇక, ప్రతి విషయంలోనూ.. తన మాటే నెగ్గాలని నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు భీష్మిస్తున్నారు. ఇది పార్టీ నాయకులకే కాకుండా.. అధికారులకు కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పనులు ముందుకు సాగడం లేదు. పార్టీ పరంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉన్నా.. ఇలాంటి అడ్డంకుల కారణంగా.. కార్యకర్తలు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై పార్టీ ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదని అంటున్నారు.
This post was last modified on February 26, 2026 11:18 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…