కొన్ని కొన్ని సంగతులు.. నమ్మేందుకు శక్యం కాదు! కానీ, అవి పక్కా నిజాలు. ఇలా కూడా జరుగుతాయా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ దేశంలో ఏదైనా కూడా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన తన ఇంట్లో ట్యూషన్లు చెబుతున్నారు. సరే.. అందరూ ఏమనుకుంటారు? ఆయనంత సీనియర్ కాబట్టి.. చాలా బాగా పాఠాలు చెబుతారు అనేకదా!
కానీ, సదరు ప్రొఫెసర్ గారు.. దొంగతనం ఎలా చేయాలి? అనే విషయాన్ని పక్కగా నూరి పోస్తున్నారు. అంతేకాదు.. అంతర్రాష్ట్ర దొంగలను ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుని.. దొంగతాను చేయడం.. పోలీసులకు దొరికి పోకుండా.. బయట పడడం.. ఎప్పటికీ.. అంతుచిక్కకుండా వ్యవహరించడం.. అనే మూడు కాన్సెప్టులపై ఆయన ఇస్తున్న లెక్చరర్లు పోలీసుల ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యం గొలుపుతున్నాయి.
అంతేనా.. ఒక్కసారి ఆయన లెక్చర్ వింటే.. దొంగతనం చేయాలని అనిపించకుండా ఉండదు. మావోయిస్టు నేతలు ప్రసంగాలు విన్నాక.. వారిలో చేరిపోయినట్టే.. ఈ ప్రొఫెసర్ గారి పాఠాలు విన్నాక.. పదుల సంఖ్యలో యువత దొంగతనాల బాట పట్టారంటే.. మరింత ఆశ్చర్యం వేస్తుంది. ఇటీవల బిహార్ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బులు పోతే బాధపడేవారు కాదు. నగలు పోయినా.. ఇబ్బంది ఉండేది కాదు. కానీ, సదరు ఎమ్మెల్యే పదోతరగతి సర్టిఫికెట్ దొంగలు దోచుకెళ్లారు.
ఆయనకు ఉన్న ఒకే ఒక్క అర్హత టెన్త్‌క్లాస్. దీంతోనే ఆయన నాలుగు ఎన్నికల నుంచి నెట్టుకువస్తున్నారట. ఇప్పుడు అది పోవడంతో సీరియస్‌గా తీసుకుని..కంప్లెయింట్ ఇచ్చి.. ఫాలో అప్ చేశారు. ఈ క్రమం లో దొరికిన దొంగలను పోలీసులు విచారించారు. దీంతో విషయాలు వెల్లడయ్యాయి. ఇంకేముంది.. ప్రొపెసర్‌ను అరెస్టు చేశారు. అయితే.. ఆయన చోర కళ మెళుకువలను తెలుసుకున్నాక.. ఇప్పుడు పోలీసులపైనే నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందట. ఇది జరిగింది.. కలకత్తా మహానగరంలోనే కావడం మరో చిత్రం!!
Gulte Telugu Telugu Political and Movie News Updates