కొన్నేళ్ల చిత్ర విచిత్రమైన ఉదంతాలు కొన్ని విదేశాల్లో జరిగినట్లుగా వార్తా పత్రికల్లో చదివేటోళ్లం. అలాంటప్పుడు.. ఇలాంటివి మన దగ్గర జరిగే అవకాశం లేదన్నట్లుగా అనుకునేటోళ్లు. ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఇలాంటివి మన దగ్గర జరిగే ఛాన్సులే లేవనుకున్న ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని గురించి తెలిసిన వారంతా అవాక్కు కావటమే కాదు.. ముక్కున వేలేసుకుంటున్నారు.
చందానగర్ కు చెందిన 26 ఏళ్ల టీచర్ ఒక ప్రైవేటు స్కూల్లో పని చేస్తోంది. అదే స్కూల్ లో చదివే పదో తరగతి కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడుస్తున్న వైనం బయటకు వచ్చింది. ఇదంతా ఎలానంటే.. ఆ టీచర్ రెడు రోజులు పాటు కనిపించకుండా పోవటం.. దీంతో ఆమె తాత చందానగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో పదో తరగతి విద్యార్థి కూడా కనిపించకుండా పోయాడు. అతడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 16న వెళ్లిన వారు.. రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. పిల్లాడ్ని ఎక్కడికి వెళ్లావని నిలదీయగా.. అసలు విషయం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది.
దీంతో.. పోలీసులకు సమాచారాన్ని ఇవ్వటంతో ఆమెను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో టీచర్ తాత తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలిసింది. సదరు టీచర్ కు ఈ మధ్యన పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో వారు ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అక్కడెక్కడో ప్రాశ్చత్య దేశాల్లో జరుగుతుంటాయన్న విషయాలు.. ఇప్పుడు మన దగ్గర చోటు చేసుకోవటం గమనార్హం.
This post was last modified on March 4, 2023 11:03 am
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…