ఇండియాలో లాక్ డౌన్ పెట్టడం వల్ల అన్ని వేల కోట్ల ఆదాయం పోయింది.. ఇన్ని లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.. ఆ రంగం నాశనమైంది. ఈ రంగం దెబ్బ తింది.. ఇలాంటి వార్తలే వింటున్నాం కొన్ని నెలలుగా. కానీ లాక్ డౌన్ వల్ల లాభం కూడా జరిగింది.. దీని వల్ల భారతీయులు 5 వేల కోట్లకు పైగా ఆదాయం మిగుల్చుకున్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. ఈ విషయం బ్రిటన్‌లోని సరెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలడం విశేషం.
లాక్ డౌన్ ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం ఎంతగానో తగ్గిందని.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో కాలుష్య శాతం తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడిందని ఈ అధ్యయనం వెల్లడించింది.
గాల్లోని పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర అదుపులోకి వచ్చిందని ఈ అధ్యయనంలో తేలింది. ఇతర నగరాల్లో 24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడిందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితులతో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.
వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి రూ.5 వేల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రకంగా ప్రజలకు డబ్బు మిగలడంతో పాటు ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని.. ఇది లాక్ డౌన్ వల్ల జరిగిన మేలని అధ్యయనం వెల్లడించింది.
This post was last modified on July 19, 2020 11:33 am
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…