క‌రోనా వారి పెండ్లి పిలుపు..

సాధార‌ణంగా పెళ్లిళ్ల‌కు ఆహ్వానాలు అందుతుంటాయి. అయితే.. ఇప్పుడు మీరు చ‌ద‌వ‌బోయేది వెరైటీ ఇన్విటేష‌న్‌. దీనిని ఏర్చి కూర్చిన విధానం అద్భుతః! ఎందుకంటే.. ప్ర‌పంచంలో క‌రోనా వ్యాప్తి అయిపోయింద‌ని.. చేతులు దులిపేసుకుని.. కంటి నిండా నిద్ర‌పోవాల‌ని అనుకున్న త‌రుణంలో మ‌రోసారి క‌రోనా కేసులు పుంజుకున్నాయి.

క‌నీసం ఈ ఏడాదైనా.. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు చేసుకుందామ‌ని అనుకున్న ప్ర‌జ‌లకు చైనా స‌హా ప‌లు దేశాల్లో పెరుగుతున్న క‌రోనా కేసులుకంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాని మోడీ త‌న మ‌న్‌కీబాత్‌లో క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను మ‌రోసారి పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

ఇదిలావుంటే.. క‌రోనా నేప‌థ్యంలో తాజాగా ఒక వెరైటీ పెళ్లి ఆహ్వాన ప‌త్రిక వైర‌ల్‌గా మారింది. అదేంటంటే..
కరోనా వారి పెండ్లి పిలుపు
మా దేశ అదృశ్య పుత్రుడు వరుడు: చి కరోనా,
చైనా వాస్తవ్యులు MBBS, FRCS
వధువు: చిలసౌ। మిగిలిన దేశాల ప్రజలు
వివాహ మహోత్సవము జరుపుటకు కాలము నిర్ణయించబడినది
సుముహూర్తం: స్వస్తిశ్రీ చైనా మానేన శ్రీ కరోనా నామ సం॥ర కరోనా నక్షత్రయుక్త కరోనాలగ్న పుష్కరాంశ గడియ (కరోనా స్పెడ్ అవుతున్నంతకాలం)
కళ్యాణవేదిక: క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డు గల హస్పిటల్ నందు
విందు: 2 గోళీలు (టాబ్లెట్స్) 3 టానిక్ సిసాలు (డాక్టర్స్ వేసుకోమన్నటైం కి
ఆహ్వానించువారు: చైనా దేశా ప్రజలు

-బంధువులు:-
పెద్దనాన్న: ఇటలీ,
చిన్న నాన్న: ఫ్రాన్స్
అత్తమ్మ: నెదర్లాండ్,
పెద్దమ్మ: స్పెయిన్,
చిన్నమ్మ: ఇరాన్
మామయ్య: ఇంగ్లాండ్
209 దేశాల బంధుమిత్రులు అభినందనలతో…
ముఖ్య అతిథి: అమెరికా

విన్నపము: మూతికి గుడ్డకట్టి, సానిటైజర్ చేతబట్టి, కళ్యాణవేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ తమ చేతలతో కరోనా ని ఆశీర్వదించగలరు.