హైదరాబాద్‌లో సరైన అద్దె ఇల్లు సంపాదించడం తేలిక కాదు. ఇల్లు చూసుకున్నా.. ఏటా అద్దెలు పెంచుతూ పోతుంటారు. ఇక్కడ ఎప్పుడూ ఉండే తతంగమే ఇది. అద్దె ఇళ్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది తప్ప తగ్గట్లేదు. టు లెట్ బోర్డు పెట్టడం ఆలస్యం.. వెంటనే ఆరాలు మొదలవుతాయి. ఇల్లు ఫిల్ అయిపోతుంది.
కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ నగరంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుండటం.. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో జనాలు భయపడి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. వలస కార్మికులే కాదు.. మిగతా వాళ్లు కూడా హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు.
ఐతే లాక్ డౌన్ దెబ్బకు అందరి ఆదాయాలూ దెబ్బ తిన్నాయి. ఉపాధి పోయింది. దీంతో సామాను ఇక్కడే పెట్టి భారీగా అద్దె కట్టే పరిస్థితి కూడా లేదు. అలాగని సామానంతా తీసుకుని సొంతూర్లకూ వెళ్లలేరు. అదంత తేలికైన విషయం కాదు. తిరిగి సామానంతా ఇక్కడికి తెచ్చుకోవడమూ కష్టమే.
ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్లందరూ సామాను పెట్టుకోవడం కోసమే వెలసిన గోడౌన్లను ఆశ్రయిస్తున్నారు. ఇంటి సామాను పెట్టి నెలకు ఇంత అని తక్కువ మొత్తంలో అద్దె వసూలు చేసే గోడౌన్లు ఇటీవల చాలా తయారయ్యాయి.
వివిధ వ్యాపారాల కోసం ఉపయోగించే గోడౌన్లు చాలానే ఈ మధ్య ఖాళీ అయిపోయాయి. వాటిని ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలు టేకోవర్ చేస్తున్నాయి. ఇంటి అద్దెతో పోలిస్తే తక్కువ మొత్తంతో ఇక్కడ సామాను పెట్టుకుని లాక్ చేసుకునే సౌలభ్యం కనిపిస్తుండటంతో జనాలు వాటిని ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టు లెట్ బోర్డులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అద్దెలు తగ్గిస్తున్నా సరే.. జనాలు అద్దె ఇళ్లలోకి రాకపోతుండటంతో యజమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
This post was last modified on July 15, 2020 4:16 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…