కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఏపీలో పాత పద్దతుల్ని కొనసాగిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పాజిటివ్ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రోగ లక్షణాలు తక్కువగానూ.. స్వల్పంగా ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. హోం ఐసోలేషన్ లోనే ఉండేలా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐసోలేషన్ లో ఉన్న పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సాయంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ కొవిడ్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు ఛాతీ నొప్పితో బాధ పడుతుంటే.. అలాంటి వారంతా వెంటనే 18005994455 నెంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
టోల్ ఫ్రీనెంబరుకు ఫోన్ చేస్తే.. బాధితుల అవసరానికి తగ్గట్లు వారి ఇళ్లకు 108 అంబులెన్స్ లను పంపి.. మెరుగైన వైద్యం చేస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పదివేలకు పైగా పాజిటివ్ రోగులు ఇళ్లలోనే ఉన్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. సూచనల్నినిత్యం అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12680 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వారిలో ఎలాంటి లక్షణాలు లేని వారు.. సూక్ష్మ లక్షణాలు ఉన్న వారు 10518 మంది ఉంటే.. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 1701గా ఉన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారు 461గా చెబుతున్నారు. రోగ లక్షణాలు కనిపించని.. సూక్ష్మంగా ఉన్న వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తెచ్చారు. సో.. ఈ నెంబరు చాలా కీలకమైనది. ఎప్పుడు అవసరమవుతుందో తెలీదు. అందుకే.. వెంటనే ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on July 11, 2020 11:06 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…