చైనాకు భారత్ కంటే పెద్ద షాకిచ్చిన యాపిల్

Apple

59 చైనీస్ మొబైల్ యాప్స్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తగిలిన్ షాక్ నుంచే ఇంకా తేరుకోని చైనాను అమెరికా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన యాపిల్ భారీగా దెబ్బకొట్టింది. అయితే, ఇది తమ నిబంధనల సవరణలో భాగంగా మాత్రమే అని పేర్కొంది. తాజాగా యాపిల్ సంస్థ యాప్ స్టోర్ లోని 4500 చైనీస్ గేమ్ యాప్స్ ను తొలగించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వీటిని తొలగించడం సంచలనం అయ్యింది.

ఈ నిర్ణయంపై పూర్తి క్లారిటీతో యాపిల్ ఒక ప్రకటన చేసింది. లైసెన్స్‌ నిబంధనలను తాము మరింత కఠినతరం చేస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించామని, అందులో భాగంగా ఈ యాప్స్ తమ అర్హతను కోల్పోవడం వల్ల తొలగించాం అని పేర్కొంది. వీటిని నిషేధించలేదు, కేవలం తొలగించాం అని చెప్పింది.

యాప్ స్టోర్ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆ యాప్స్ ను రీడిజైన్ చేసుకుని, మా ప్రమాణాలకు అనుగుణంగా మారిస్తే యాప్ స్టోర్ లో మళ్లీ అప్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.
భారత్ నిర్ణయంతో ఇప్పిటే సుమారు లక్ష కోట్లు నష్టపోయినా చైనా… యాపిల్‌ కంపెనీ నిర్ణయంతో చావు దెబ్బ తినింది. ఈ చర్య చైనాను మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రమాదం ఉంది.

ఆర్థికంగా కూడా చైనా బాగా నష్టపోతుందని నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన అనుమతులు లేని గేమ్స్ తాము ఎన్నటికి అనుమతించమని… అన్ని దేశాల చట్టాలకు అనుగుణంగా ఉంటేనే వేటికైనా మా వద్ద స్థానం ఉంటుదని పేర్కొంది. సరిగ్గా ఈ ప్రకటనకు మూడు రోజుల ముందే ట్రంప్… నాకు చైనాపై రోజురోజుకు కోపం రెట్టింపవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.