బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్ సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్‌లోని భారతీయ మూలాలుగలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వమని, మనకు గర్వకారణమని చెప్తున్నారు. అయితే.. ఇదంతా కూడా బ్రిటన్‌లోని భారతీయ మూలాలు ఉన్న వారిని తనవైపు తిప్పుకొనే ఎన్నికల ఎత్తుగడగా.. ప్రత్యర్తులు చెబుతున్నారు.
మరోవైపు రిషి సునాక్ మాత్రం.. దైవ బలం ఎవరికైనా అవసరమేనని.. అందుకే.. తాను గోపూజ చేశానని అన్నారు. కాగా, రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తి వేదాంత మేనర్ దేవాలయంలో పూజలు చేశారు. దీనిలో భాగంగా దంపతులిద్దరూ గో పూజ చేసి, హారతి ఇచ్చారు. ఈ వీడియోలను, ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
రిషి సునాక్ గత ఏడాది దీపావళి పండుగను తన అధికారిక నివాసంలో జరుపుకున్నారు. నూనె దీపాలను వరుసగా వెలిగించారు. దీంతో భారతీయులంతా ఆయనను మెచ్చుకున్నారు. ఈ పరిణామంతో ఆయనకు మద్దతు పెరుగుతోందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
ఇదిలావుండగా, బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ కన్నా వెనుకబడి ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో భారత సంతతి ప్రజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు సుమారు 2.5 శాతం మంది. బ్రిటన్ జీడీపీలో 6 శాతం వీరి ద్వారా లభిస్తోంది. 2021లో ఇండియన్ కంపెనీలు 805 ఉండేవి, 2022లో వీటి సంఖ్య 900కు పెరిగింది. భారతీయుల విజయం వెనుక రుషి ఉన్నారు.
This post was last modified on August 26, 2022 10:25 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…