ఎక్కడ చూసినా లైగర్ చర్చలతోనే గత ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. రకరకాల మీమ్స్, సోషల్ మీడియా పోస్టులతో చూసినవాళ్లతో పాటు చూడనివాళ్ళు కూడా టాక్ స్ప్రెడ్ చేయడంలో బిజీ అయిపోయారు. ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ నైచల్తా కానీ ఏరకంగానూ లైగర్ తో పోటీ పడలేమని తెలిసి కూడా ఒక రోజు గ్యాప్ తో కొన్ని చిన్న సినిమాలు ఈ రోజు విడుదలయ్యాయి. కౌంట్ పరంగా నాలుగైదు ఉన్నప్పటికీ వాటిలో కాస్త చెప్పుకోదగ్గ బజ్ ఉన్నది మాత్రం కళాపురంకు ఒక్కటే
ఈ మాత్రం అటెన్షన్ తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడమేనని వేరే చెప్పనక్కర్లేదు. పలాసతో మంచి పేరు తెచ్చుకున్నా శ్రీదేవి సోడా సెంటర్ తో ఫ్లాప్ మూటగట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్ పూర్తి వినోదాత్మకం వైపు వచ్చేసి చేసిన మూవీ కళాపురం. అయితే స్టార్ లెవరూ లేకపోవడంతో కామన్ ఆడియన్స్ కి దీని మీద అంత ఆసక్తి కలగలేదు. ఇక మ్యాటర్ విషయానికి వస్తే కోటి రుపాయలతో పల్లెటూరిలో సినిమా తీయడానికి వచ్చిన ఓ డెబ్యూ డైరెక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. లీడ్ రోల్ సత్యం రాజేష్ ది.
లైన్ వినడానికి బాగానే అనిపించినప్పటికీ హిలేరియస్ కామెడీ ఉంటే తప్ప ఇలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఎంటర్ టైనర్లు జనాన్ని మెప్పించలేవు. అన్ని జాతిరత్నాలు కాలేవు. కరుణ కుమార్ సమస్య రైటింగ్ లోనే వచ్చింది. నటీనటులు తమ వరకు పెర్ఫార్మన్స్ పరంగా లోటు రానివ్వనప్పటికీ సన్నివేశాల్లో బలం లేకపోవడం కళాపురంలో కళను తగ్గించేసింది. క్లైమాక్స్ ని ఏదో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు కానీ అదీ అంతగా అతకని వ్యవహారమే. థియేటర్ లో ఏవి చూడాలి ఓటిటి కోసం ఏవి వెయిట్ చేయాలనే ఫుల్ క్లారిటీతో ఆడియన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సోసో సబ్జెక్టులతో టికెట్ తెగేలా చేయడం కష్టమే.
This post was last modified on August 27, 2022 5:37 am
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…