Movie News

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. హీరోలే దర్శకులైపోతున్నారు. తమను ఎలా చూపించాలో అర్థం కాక దర్శకులు వరస డిజాస్టర్లు ఇస్తుండటంతో తామే మెగా ఫోన్ చేపట్టి అందులో సాధక బాధలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్ తరహాలో వీళ్ళ గురించే చర్చ జరుగుతోంది. ఒకవేళ సక్సెస్ అయితే టాలీవుడ్ కో కొత్త దిశానిర్దేశనం చేసిన వాళ్ళవుతారు.

మొదటి పేరు విశ్వక్ సేన్. అయితే తనకు దర్శకత్వం కొత్త కాదు. మూడో సినిమా ఫలక్ నుమాదాస్’తోనే నిరూపించుకున్నాడు. మలయాళం రీమేక్ అయినప్పటికీ తన టాలెంట్ జోడించి సక్సెస్ అందుకున్నాడు. కానీ ‘దాస్ కా ధమ్కీ’ పెద్ద ధమ్కీ ఇచ్చింది. డ్యూయల్ రోల్ చేయబోయి ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు వరుస ఫ్లాపులు వచ్చేసరికి ‘కల్ట్’ రూపంలో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బడ్జెట్ పెద్దదే పెడుతున్నాడు.

రెండో పేరు రామ్. ఎనర్జిటిక్ స్టార్ గా పేరొంది టాలెంట్, డాన్స్, అందం అన్నీ ఉన్నా సక్సెస్ మాత్రం ఒక ఫ్లోలో రావడం లేదు. ముఖ్యంగా ‘ఆంధ్రకింగ్ తాలూకా’ పాజిటివ్ టాక్ వచ్చి కూడా ఫెయిల్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఈసారి సాఫ్ట్ జానర్ పక్కనపెట్టి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. మూడో పేరు కిరణ్ అబ్బవరం. ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యూత్ హీరోకి ‘చెన్నై లవ్ స్టోరీ’ మంచి బూస్ట్ ఇచ్చింది. వీకెండ్ లోపే హిట్టు ముద్ర వేయించేసుకుంది.

ఎస్ఆర్ కళ్యాణమండపానికి కథ మాటలు రాసిన కిరణ్ ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. నాలుగో పేరు సుధీర్ బాబు. మార్కెట్ బాగా రిస్క్ లో పడేసుకున్న తనకు ఎంత కష్టపడే తత్వమైనా ఉంది కానీ ఎందుకో విజయం మాత్రం వరించడం లేదు. అందుకే తనను తాను డైరెక్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో ఎన్టీఆర్, కృష్ణ కాలంలో హీరో కం దర్శకులను చూసాం. ఇప్పుడీ జెన్ జీ తరంలో ఈ నలుగురు కొత్త బాట వేస్తారేమో చూడాలి. 

This post was last modified on July 27, 2026 9:49 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

5 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

6 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

7 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

11 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

11 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

13 hours ago