మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే వచ్చాయి. కిరణ్ అబ్బవరం కెరీర్ లో హయ్యుస్ట్ నెంబర్లు నమోదు కాగా తెలుగమ్మాయి అయ్యుండి టాలీవుడ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న శ్రీగౌరీ ప్రియకు ఆ కోరిక నెరవేరింది. నిర్మాతలు ఎస్కెఎన్, ధీరజ్ మొగిలినేని, సాయి రాజేష్ ఆనందం చెప్పనక్కర్లేదు. అయితే సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతం ఉంటుందనే దాని మీద ట్రేడ్ ఎదురు చూస్తోంది.
లెక్కల సంగతి కాసేపు పక్కనపెడితే చెన్నై లవ్ స్టోరీకి యునానిమస్ టాక్ రాలేదన్నది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం క్షణం బోర్ లేకుండా చక్కగా నడిపించిన దర్శకుడు రవి నంబూరి సెకండాఫ్ లో పూర్తిగా ట్రయాంగిల్ లవ్ వైపు వెళ్లిపోవడం అంతగా పండలేదు. ఇది నచ్చినవాళ్లు కూడా ఉన్నారు కానీ మెజారిటీ జనాలు రెండో సగం ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉన్నా మరీ కన్నీళ్లు వచ్చేంత స్థాయి కాదు.
ముందు నుంచి మేకర్స్ ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ అంటూ ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. సెకండాఫ్ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే ఆ మాటకు సార్థకత చేకూరేది. ప్రేమిస్తే, బేబీ లాంటి చిత్రాలు అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం కేవలం ఏదో ఒక సగం బాగుండటం కాదు. టైటిల్స్ నుంచి చివరి దాకా ఒక ఇంటెన్సిటీని, ప్రేమకథలోని డెప్త్ మెయింటైన్ చేయడం వల్ల. చెన్నై లవ్ స్టోరీలో ఇది మిస్ అవ్వడం వల్లే ప్రీమియర్ షోస్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
అలాని హిట్టు సినిమాని ఎవరూ తక్కువ చేయలేరు కానీ స్క్రిప్ట్ దశలోనే ఇలాంటి హెచ్చుతగ్గులను గుర్తించి ఉంటే బాగుండేదని జనం అభిప్రాయపడుతున్నారు. మూడు రోజులు మంచి ఫుల్స్ పడ్డాయని లోపాలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తే పొరపాటే అవుతుంది. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల కోట్లు వసూలు చేసినా హిందీ, తమిళం, ఓవర్సీస్ లో ఫ్లాప్ కిందకే వస్తుంది. దాంట్లో జరిగిన తప్పు ఎమోషన్ ఓవర్ డోస్ అయిపోవడం. చెన్నై స్టోరీలోనూ అలాంటి మైనస్సులు ఉన్నా ఇతర ప్లస్సులు రక్షణ కవచంలా కాపాడాయి.
This post was last modified on July 27, 2026 10:06 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…