ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు కాదు ఒకే యువకుడిని ముగ్గురు పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా పేరొందిన ఇద్దరు సోదరీమణులు, వారి బంధువు కలిసి ఒకే యువకుడిని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది.
అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ చాముండా దేవాలయంలో జూలై 15న ఈ వివాహం జరిగింది. బీటెక్ విద్యార్థిని సరోజ్ (20), ఆమె సోదరి సావిత్రి (19), బంధువైన ఖటక్‌వంశి (18) తమ రీల్స్‌కు కెమెరామన్‌గా పనిచేసే వికాస్ అలియాస్ విక్కీ (20) మెడలో ఒకే వేదికపై తాళి కట్టించుకున్నారు.
ఈ ముగ్గురు యువతుల వీడియోల్లో వికాస్ తరచూ భర్త పాత్రలో నటించేవాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ముగ్గురూ కలిసి అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్థానిక కథనాల ప్రకారం, ముగ్గురిలో ఒకరికి కుటుంబ సభ్యులు మరో వివాహం నిశ్చయించగా, “చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం… ఇప్పుడు విడిగా ఉండలేం” అంటూ ముగ్గురూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరులను వెతికినా దొరకకపోవడంతో, చివరకు ఒకే యువకుడిని వివాహం చేసుకోవడమే మార్గమని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వివాహానంతరం యువతులు స్పందిస్తూ, “మేమంతా మేజర్లం. మా ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు. మేము సంతోషంగా ఉన్నాం” అని తెలిపారు. అలాగే, “గతంలో రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కదా” అంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
అయితే ఈ వివాహం చట్టబద్ధత, వ్యక్తిగత చట్టాల ప్రకారం దీని చెల్లుబాటు వంటి అంశాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కొందరు దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా అభివర్ణిస్తుండగా, మరికొందరు చట్టపరమైన, సామాజిక కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
This post was last modified on July 24, 2026 3:20 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…