Movie News

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం దక్కేది. అందుకే ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా ఎవరూ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించలేకపోయారు. అర్హత ఉన్న చిత్రాలను సైతం ఒకప్పటి జ్యురీ సభ్యులు పక్కనపెట్టేవారు. అలాంటిదిప్పుడు కమర్షియల్ మూవీస్ కి దక్కుతున్న ప్రాధాన్యం సీనియర్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పుష్ప విషయంలో ఇది బాగా డిస్కషన్ లోకి వచ్చింది.

తాజాగా రాయన్ మీద కూడా అలాంటి డిబేట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఫార్ములాతో రూపొందిన ఒక మాఫియా రివెంజ్ డ్రామాని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనేది ఎంతో మంది లేవనెత్తుతున్న ప్రశ్న. కార్తీ సత్యం సుందరం లాంటివి కనపడలేదా అని నేరుగానే సోషల్ మీడియాలో నిలదీశారు. తాజాగా ధనుష్ దీని గురించి స్పందించాడు. ఆ సంవత్సరంలో రాయన్ కన్నా మంచి సినిమాలు చాలా వచ్చాయని ఎలాంటి భేషజం లేకుండా నిజాయితీగా ఒప్పుకున్నాడు.

అయితే గతంలో కర్ణన్, మరియన్, 3, వడ చెన్నై, పుదుపేట్టై, అసురన్, రాంఝానా వచ్చినప్పుడు తనకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది చెప్పారని, అప్పుడు నిరాశ కలిగిందని, కానీ ఇప్పుడు రాయన్ కు దక్కి మిగిలిన వాళ్లకు రాకపోవడం పట్ల ఇలాంటి రియాక్షన్లు ఉండటం సహజమని వివరించాడు. నిజమే కదా. రాయన్ కన్నా బెస్ట్ మూవీస్ ముమ్మాటికీ వచ్చాయి. కానీ దీన్నే ఎందుకు ప్రత్యేకంగా పరిగణించారనే దానికి సమాధానం దొరకడం కష్టం.

రాబోయే సంవత్సరాల్లో దీని గురించి మరింత విశ్లేషణలు జరగడం ఖాయం. ఈ ఏడాది అయిపోక ముందే దురంధర్ లో రణ్వీర్ సింగ్ కు వస్తుందా లేక పెద్దిలో రామ్ చరణ్ కి ఇస్తారా అంటూ ఏవేవో ఊహాగానాలు మొదలుపెట్టేశారు. రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఏమేం సినిమాలు వస్తాయో, వాటిలో ఆర్టిస్టులు ఎలా చేస్తారో తెలియక ముందే స్పెక్యులేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇకపై ఇదో ప్రహసనంలా కొనసాగుతుంది తప్ప బ్రేకులు పడటం, ఎవరో ఒకరు ఆపేయడం జరగని పని. 

This post was last modified on July 26, 2026 8:41 pm

Share

Recent Posts

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాజ‌కీయం మామూలుగా లేదే.. !

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజ‌కీయాలు కూట‌మిలోనే అంత‌ర్గ‌త వివాదాల‌కు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉంది.…

47 minutes ago

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

5 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

10 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

12 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

12 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

14 hours ago