కరోనాకు మనుషుల్లో చిన్నా, పెద్దా.. రాజూ పేదా అనే తేడాి లేదని అనుకున్నాం. మనుషులు, జంతువులనే తేడా కూడా లేదని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. కర్ణాటకలో తాజాగా గొర్రెలు, మేకలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం.
మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా కరోనా సో్కే అవకాశం ఉందని.. వాటి నుంచి కూడా మనుషులకు కరోనా సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో 50కి పైగా గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఉదంతం కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతంలో ఉన్న చిక్కనాయకహల్లిలో జరిగింది.
ఈ గ్రామంలోని అనేక గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు విషయం చేరవేశారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. గొర్రెల యజమానికి కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. గొర్రెలు, మేకల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ లోపు ఆ యజమానికి చెందిన 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచారు.
వైద్యాధికారులు వెళ్లినపుడు కూడా గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం గమనించారు. ఐతే కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కచ్చితంగా చెప్పలేమని.. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు అధికారులు తెలిపారు.
This post was last modified on July 3, 2020 11:55 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…