గడచిన రెండు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా సైన్యాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని అనేక కీలక నగరాలు రష్యా దెబ్బకు ధ్వసమైపోయాయి. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇదే సమయంలో రష్యా భూభాగంపై ఈ మధ్య విధ్వంసాలు మొదలయ్యాయి. ఒకచోట చమురు నిల్వకేంద్రంలో నిప్పులు ఎగిసిపడ్డాయి. మరోచోట ఆయుధ డిపో పేలిపోయింది. ఇంకోచోట పేలుళ్ళు జరిగి మొత్తం నాశనమైపోయింది.
ఇలాంటివి రష్యాలో జరుగుతుండటంతో అందరికీ ఒక అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే రష్యా భూభాగంలో ఉక్రెయిన్ రహస్య ఆపరేషన్ మొదలుపెట్టిందాని. ఎందుకంటే రష్యాలో జరిగిన ఘటనలేవీ యాధృచ్చికంగా జరిగినవి కావు. ఘటనలు జరిగిన ప్రాంతాలేవీ, స్ధావరాలేవీ మామూలు జనాలు ప్రవేశించే అవకాశాలు లేనివి కావటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రష్యాలోని ట్వేర్ నగరంలో ఉన్న ఏరోస్పేస్ రీసెర్చి సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెంటర్ దాదాపుగా కాలి బుగ్గయిపోయింది.
ఫెర్మ్ నగరంలో అత్యంత భద్రతా జోన్లో ఉండే ఆయుధ డిపోలో ఒక్కసారిగా పేలుళ్ళు జరిగింది. బెలారస్ లోని బ్రయాస్క్ లోని కీలకమైన చమురు డిపోకు నిప్పంటుకుని నిల్వలన్నీ నావనమైపోయాయి. జరుగుతున్న వరుస ఘటనలను గమనించిన నిపుణులకు అనుమానాలు పెరిగిపోయాయి. ఇవన్నీ యాధృచ్చికంగా జరిగాయనటం కన్వీన్సింగా లేవట. ఎవరో కావాలని చేస్తున్న పనే అని నిర్ధారణకు వస్తోంది రష్యా ఇంటెలిజెన్స్ కూడా. ఎవరో అంటే ఉక్రెయిన్ తప్ప ఇంకెవరూ రష్యాకు నష్టం చేసే పనులు చేయరట.
ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ బృందాలు రష్యాలోకి చొరబడి ఇలాంటి విధ్వంసాలకు దిగుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్లో రష్యా సైన్యాలు చేస్తున్న విధ్వంసాలకు బదులుగా ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ రహస్య ఆపరేషన్లకు తెగిస్తోందని పుతిన్ కూడా అనుమానిస్తున్నారట. వీటిని వెంటనే కంట్రోల్ చేయలేకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు వస్తాయని పుతిన్ సైన్యాధికారులను ఆదేశించారట. అన్నీ నిర్మాణాలు, రీసెర్చి సెంటర్లు, మిలిటరీ బేస్ లు, ఆయుధాల డిపోలు, చమురు క్షేత్రాలు తదితరాల దగ్గర మిలిటరీ నిఘాను, కాపలాను పెంచాలని పుతిన్ చెప్పారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates