ఉక్రెయిన్ యుద్ధంలో చిత్ర, విచిత్రాలు

యుద్ధం మొదలైన ఐదవరోజున ఉక్రెయిన్లో ఏం జరుగుతోందో అందరిలో అయోమయం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మొదటి మూడురోజుల్లోనే చాలా ప్రాంతాలను ధ్వంసం చేసేసింది. ముఖ్యమైన వైమానిక స్ధావరాలను, విమానాశ్రయాలను స్వాదీనం చేసేసుకుంది. ఛెర్నోబిల్ అణు కర్మాగారాన్ని స్వాదీనం చేసుకుంది. ఇంతవరకు క్లియర్ గానే ఉంది.

అయితే నాలుగో రోజున మాత్రం కొన్ని ఆశ్చర్యకరమైన ఘటనలు జరిగాయి. అవేమిటంటే రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం మామూలు జనాలను కూడా యుద్ధంలోకి దింపేసింది. 18-45 సంవత్సరాల మధ్య ఉన్న సామాన్య జనాలకు కూడా ఆయుధాలను ఇచ్చి రష్యా సైన్యంమీదకు పంపింది. దాంతో ఆయుధాల ప్రయోగించగలిగిన వారు కొందరు రష్యా సైన్యాన్ని ఎదిరించారు. మరికొందరు రష్యా సైన్యం దెబ్బకు బలైపోయారు.

జనాలకు ఆయుధాలు ఇచ్చినా పెద్దగా ఉపయోగం లేదని తెలుసుకున్న ఉక్రెయిన్ ప్రభుత్వం వెంటనే పెట్రోలు బాంబులను అందించింది. దాంతో జనాలంతా ఒక్కసారిగా విజృంభించారు. చేతుల్లో పెట్రోలు బాంబులను పట్టుకుని రష్యా సైన్యంమీదకు విసరటం మొదలుపెట్టారు. దాంతో రష్యా సైన్యంకు ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు. ఎందుకంటే పెట్రోల్ బాంబులు పేలి రష్యా సైన్యం కూడా బాగా దెబ్బతింటోందని సమాచారం. రష్యా సైన్యంమీదకు జనాలు పెట్రోలు బాంబులు విరసటంతో అవిపేలుతున్నాయి. ఆ మంటల్లో రష్యా సైన్యం చనిపోతున్నారు.

ఇదే సమయంలో మూడురోజులు చోద్యం చూసిన నాటో దళాల నుండి ఉక్రెయిన్ కు నాలుగోరోజు నుండి జర్మనీ, నెదర్లాండ్స్. ఫ్రాన్స్ దేశాలు సైన్యాన్ని, ఆయుధాలను అందిచాయి. దాంతో సరైన ఆయుధాలు లేక అవస్తలు పడుతున్న ఉక్రెయిన్ సైన్యం రెచ్చిపోతోంది. అమెరికా కూడా 600 మిలియన్ డాలర్ల సాయం అందించింది. నాటో దళాల్లో ఒక్కో దేశం ఉక్రెయిన్ కు సాయంగా నిలబడుతున్నాయి. ఉక్రెయిన్ లో రష్యా సైన్యంపై మామూలు జనాలేం చేస్తున్నారు, సైన్యం ఏమి చేస్తోంది, నాటో దేశాల సాయం ఎంతవరకు అనే విషయాల్లో సరైన స్పష్టత లేక అయోమయం పెరిగిపోతోంది.