ఉక్రెయిన్: ఫ‌లించ‌ని దౌత్య వాదం.. పాపం పెద్ద‌న్న!

అన్నింటా మాట్లాడే రారాజు మ‌రియు మొన‌గాడు అయిన బైడెన్ ఇప్పుడు మాత్రం  ఏం మాట్లాడితే ఏమౌతుందో అన్న స్ట్రాట‌జీలో ఉండిపోయారు.ఉండిపోతున్నారు కూడా! ఉక్రెయిన్ విష‌య‌మై ర‌ష్యాకు చెప్పి చూసిన మాట‌లేవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో బైడెన్ నైరాశ్యంలో ఇరుక్కుపోయారు. తాము చెప్పినా కూడా, తాము వెన‌క్కు త‌గ్గాల‌ని ప‌దేప‌దే కోరినా  కూడా ర‌ష్యా అస్స‌లు విన‌ని నైజాన్ని బైడెన్ త‌ట్టుకోలేక‌పోతున్నారు.నిన్న అర్ధ‌రాత్రి దాటి వేళ కొన్ని దాడులు జ‌రిగాయి తూర్పు ఉక్రెయిన్ పై..అయితే ఈ దాడుల్లో పెద్ద‌గా ప్రాణ‌హాని లేదు కానీ కొంత ఆస్తి ధ్వంసం ఉంది. తాము ల‌క్ష మంది సైనికుల‌ను వెనక్కు పిలిచామ‌ని ర‌ష్యా చెబుతున్నా అవేవీ నిజాలు కావ‌ని అమెరికా కొట్టి పారేస్తుంది.

ఉక్రెయిన్ ఉదంతాల నేప‌థ్యంలో అమెరికా మాట‌కు ఇక‌పై విలువ ఉండ‌ద‌ని తేలిపోయింది.దేశాల మ‌ధ్య త‌గాదాల్లో త‌ల‌దూర్చి పెద్ద‌న్న పాత్ర‌ను అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడే అగ్ర రాజ్యానికి ఉక్రెయిన్ ప‌రిణామం ఓ పెద్ద‌పాఠం.ఆయుధాల వ్యాపారిగా పేరున్న అగ్ర రాజ్యాధిప‌తి పై ముందున్నంత గౌర‌వం కానీ భ‌యం కానీ ఇవాళ అంత‌ర్జాతీయంగా లేదు.

ఓ వైపు ఎదుగుతున్న దేశాల చెంత చేరి,తామూ ఎదిగిపోయాం అని అమెరికా చెప్పుకోవ‌డం మిన‌హా చేసిందేం లేదు.కొన్ని సంద‌ర్భాల్లో అస్స‌లు అమెరికా చెప్పినా కూడా ర‌ష్యా ఏ మాట‌నూ అంగీక‌రించ‌లేద‌ని పుతిన్ తో బైడెన్ మాట్లాడినా కూడా ఎటువంటి పురోగ‌తీ లేకుండా పోయింద‌ని తెలుస్తోంది.

ఎందుకంటే ఒక‌నాటి ఆర్థిక బలాలు కానీ మూలాలు కానీ ఇవాళ అమెరికాకు లేవు.ఆశించిన స్థాయిలో దేశం ప్ర‌గ‌తిలో లేదు. అంత‌ర్జాతీయ వివాదాల్లో త‌ల‌దూర్చి త‌ద్వారా ఆర్థిక ల‌బ్ధి పొందాల‌నుకోవ‌డం, ఆయుధాల అమ్మ‌కాల‌కు అదొక సంద‌ర్భంగా మ‌లుచుకోవాల‌నుకోవ‌డం ఓ పెద్ద త‌ప్పిదం.ఈ ద‌శ‌లో అమెరికా ఒక‌ప్ప‌టిలా ప్ర‌పంచంపై ప‌ట్టు పెంచుకోవాల‌న్న ఆలోచ‌నల‌ను విర‌మించుకునే దిశ‌గా ఇవాళ ఉంది.ఓ విధంగా తిరోగామి దేశంగానే ఇవాళ అమెరికా ఉంది.క‌నుక త‌న మాట నెగ్గ‌లేద‌న్న బాధ ఒక్క‌టే బైడెన్ కు మిగిలిపోయింది.సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్నీ,ఇంకా చెప్పాలంటే వేర్పాటు వాదాన్నీ,దేశాల మ‌ధ్య ర‌గిలే క‌ల‌హాల‌నూ అడ్డుపెట్టుకుని అంత‌ర్నాట‌కం న‌డిపే అమెరికాకు ఇప్ప‌ట్లో మ‌రీ అంత సానుకూల ఫ‌లితాలు అయితే వ‌చ్చేలా లేవు.