Trends

తెలుగు జర్నలిస్టు మృతి.. విషాదకర కోణం

కోవిడ్-19 అన్ని రంగాల వాళ్లనూ కబలిస్తోంది. సామాన్య జనంతో పాటు సినిమా వాళ్లు, వైద్యులు, పోలీసులు అందరూ దీని బారిన పడ్డారు. ఆయా రంగాల వాళ్లు ప్రాణాలూ కోల్పోయారు. కరోనాకు ఎదురెళ్లి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు సైతం పెద్ద ఎత్తునే కరోనా బారిన పడ్డారు. కొందరు మృత్యువాత పడ్డారు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తాజాగా మనోజ్ కుమార్ అనే టీవీ5 జర్నలిస్టు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మిస్తీనియా గ్రేవిస్ అనే వ్యాధి కారణంగా అతడికి ఇటీవలే ఓ సర్జరీ కూడా జరిగింది.

అయినప్పటికీ అతను కరోనా వేళ విధులు కొనసాగించాడు. లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం మీడియాను గట్టి దెబ్బ కొట్టింది. జర్నలిస్టులకు జీతాల చెల్లింపు సరిగా లేదు. వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మనోజ్.. అనారోగ్యంతోనూ విధుల్లో కొనసాగినట్లున్నాడు.

యుక్త వయసులో ఉన్న వాళ్లకు కరోనా సోకినా ఏమంత ప్రమాదం లేదంటున్నారు కానీ.. వేరే అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లపై అది తీవ్ర ప్రభావం చూపుతోంది. మనోజ్‌కు ఈ పరిస్థితుల్లోనే ఆరోగ్యం విషమించింది. ప్రాణాలు కోల్పోయాడు. అతడి కుటుంబ పరిస్థితి గురించి బయటికొచ్చిన సమాచారం మనోజ్ ఎవరో తెలియని వాళ్లను కూడా కంట తడి పెట్టిస్తోంది.

కొన్నేళ్ల కిందటే మనోజ్ అన్న, వదినలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. వాళ్లకు ఓ కొడుకు ఉంటే.. అతణ్ని మనోజే చూసుకుంటున్నాడు. ఎనిమిది నెలల కిందటే మనోజ్‌కు పెళ్లయింది. అన్న కొడుకును చూసుకోవడం కోసం తనకు పిల్లలు వద్దని అతను నిర్ణయించుకున్నాడట.

ఇంత త్యాగం చేసి అన్న కొడుకును చూసుకుంటున్న అతను.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అతడి భార్య, ఆ పిల్లాడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల వ్యవధిలో ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన తల్లి వేదన ఎలాంటిదో చెప్పేదేముంది?

This post was last modified on June 8, 2020 3:31 pm

Share

Recent Posts

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

5 minutes ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

18 minutes ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

41 minutes ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

1 hour ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

2 hours ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

2 hours ago