చాలామందిలో భయం నుంచి భక్తి పుడుతుంది. భయం వల్ల భక్తి ఇంకా పెరుగుతుంది కూడా. కష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ నమ్మకాలున్న వాళ్లయితే మరీనూ. ఈ క్రమంలో వాళ్లు చేసే పనులు మరీ తమాషాగా కూడా తయారవుతాయి. ఈ స్థితిలో వారి అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం.
ఉత్తరాదిన బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌లో కరోనా వైరస్ భయంతో గ్రామీణ మహిళలు చేస్తున్న పనులు చూసి అంతా షాకవుతున్నారు. కొత్తగా కరోనా దేవి అనే దేవతను సృష్టించి.. వైరస్ బారి నుంచి తమను కాపాడాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడివాళ్లు.
నలంద, గోపాల్‌గంజ్, సారన్, వైశాలి, ముజఫ్ఫర్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు కరోనా దేవి అనే దేవత నామాన్ని జనాలు జపిస్తున్నారు. తమను కాపాడమని వేడుకుంటున్నారు. కరోనా అనే దేవత తమపై పగబట్టిందని.. అందుకే ఈ వైరస్ ప్రబలుతోందని.. ఆ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తే శాంతించి.. వైరస్ తమ జోలికి రాకుండా చూస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు.
తమ గ్రామాలకు సమీపంలోని చెరువులు, నదుల దగ్గరికెళ్లి.. అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి బెల్లం పానకం, లడ్డూలు, యాలకులు, లవంగాలు లాంటి ఏడు రకాల ఆహార పదార్థాలను దేవతకు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవత శాంతిస్తుందన్నది వారి మూఢ నమ్మకం.
ఈ ఒరవడి రోజు రోజుకూ పెరిగి జనాలు పెద్ద ఎత్తున పూజల్లో నిమగ్నమవుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవట్లేదని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 6, 2020 9:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…