రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో ఎగిరి ప్రయాణం చేసే వాహనాలు) ఉన్నాయా? అన్న పెద్ద సందేహం గడిచిన కొంతకాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని లెక్క తేల్చేందుకు లంక ప్రభుత్వం పరిశోదన చేస్తోంది.
ప్రపంచంలో అందరి కంటే ముందు గాల్లో ప్రయాణించే వాహనాన్ని వాడింది రావణుడే అన్న వాదనను లంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఒక పరిశోధనా టీంను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆగిన పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక సర్కారు భావిస్తోంది. ప్రపంచంలో తొలిసారి విమానాన్ని వినియోగించింది రావణుడే అని కొందరు నమ్ముతున్నారని.. అందునా లంక ప్రజలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇది కల్పితమని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే..ఈ రెండు వాదనల్లో నిజమెంత? అబద్ధం ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు నిపుణులు.. చరిత్రకారులు.. శాస్త్రవేత్తలు.. పురావస్తు శాఖకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి.
ఈ సమావేశంలో జరిగిన చర్చ చివర్లో మాత్రం అందరూ రావణుడు విమానంలో ప్రయాణించే భారత్ కు వచ్చాడన్న మాటకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై పరిశోధనలో భాగంగా శ్రీలంక సర్కారు ఐదు మిలియన్ రూపాయిల్ని (శ్రీలంక కరెన్సీని కూడా రూపాయిలుగానే పిలుస్తారు. ప్రస్తుత మారకం ప్రకారం చూస్తే.. శ్రీలంక రూపాయికి భారత కరెన్సీ 37 పైసలు మాత్రమే ఇస్తారు) విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ పరిశోధన ముందుకు సాగలేదు.
తాజాగా.. మహమ్మారి తీవ్రత నెమ్మదించటం.. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న వేళలో.. ఈ రీసెర్చ్ ను తిరిగి షురూ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలు కానున్నాయి. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 16, 2021 11:08 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…