కథల విషయంలో, సన్నివేశాల విషయంలో స్ఫూర్తి పొందడం తప్పేమీ కాదంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన సినిమాలు చాలా వాటిలో వేరే సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. ఐతే అదే సమయంలో అవేవీ కాపీలా అనిపించవు. దేన్నయితే చూసి స్ఫూర్తి పొందాడో.. దాన్ని మించిన ఔట్ పుట్‌తో వారెవా అనిపిస్తాడు.
‘మగధీర’లో వంద మంది యోధులతో కాల భైరవ పోరాడే సన్నివేశం హాలీవుడ్ మూవీ ‘300’ స్ఫూర్తితో తీసిందే. కానీ ఒరిజినల్‌ను మించిన గొప్ప అనుభూతి కలిగేలా ఆ యాక్షన్ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు జక్కన్న. ఇక ఇదే సినిమాలో ఇంకో కీలక సన్నివేశం ‘కొదమసింహం’ మూవీలోని ఓ సీన్‌ను గుర్తుకు తెస్తుంది. అది చరణ్ ఇసుకలో కూరుకుపోతే గుర్రం వచ్చి అతణ్ని కాపాడే సన్నివేశం అని అందరికీ తెలుసు.
‘కొదమసింహం’లో చిరును విలన్లు ఇసుకలో గొంతు వరకు పూడ్చేసి వెళ్లిపోతే.. తన గుర్రం కాపాడే సన్నివేశం ఉంటుంది. ఐతే ఈ సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందడం కంటే దాన్ని చూసి అసంతృప్తి చెందడం వల్ల ‘మగధీర’లో ఆ సీన్ పెట్టినట్లు రాజమౌళి వెల్లడించడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నాడు.
“నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్లో ‘కొదమసింహం’ సినిమా చూశాను. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం నోటికి తాడు ఇచ్చి కాపాడుతుంది. ఆ సీన్ చూసి ఎమోషన్ అయ్యాను. కానీ ఆ కష్టంలోంచి బయటికి వచ్చిన చిరుకు, గుర్రానికి అనుబంధం లేదనిపించింది. ప్రాణాలు కాపాడిన గుర్రానికి థ్యాంక్స్ చెప్పకపోతే ఉద్వేగం పండదు. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోతుంది. ‘మగధీర’ ఇలాంటి సన్నివేశమే పెట్టాం. ఐతే తనను కాపాడాక చరణ్ వచ్చి గుర్రాన్ని కౌగిలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దాని పట్ల కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. ఇలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి తీసినవే” అని రాజమౌళి చెప్పాడు.
This post was last modified on November 16, 2021 3:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…