Political News

బీజేపీకి భారీ మైనస్ ?

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ లు తప్పేట్లు లేదు. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ జరిపిన సర్వేలో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోను కమలం పార్టీయే అధికారంలోకి వస్తుందని ఓ అంచనా. అయితే అన్ని రాష్ట్రాల్లోను పెద్ద మైనస్ తప్పేట్లు లేదని స్పష్టంగా కనబడుతోంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ పరిస్ధితి ఎలాగున్నా ఉత్తరప్రదేశ్ లో మాత్రం పెద్ద ఎత్తున సీట్లను కోల్పోబోతున్నట్లు సర్వేలో బయటపడిందట.

2017లో జరిగిన ఎన్నికల్లో 403 సీట్లలో 325 సీట్ల మెజారిటితో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో కమలంపార్టీకి 217 సీట్లు మాత్రమే వస్తుందని సర్వేలో తేలింది. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినా పెద్ద ఎత్తున సీట్లలో కోత అయితే పడటం ఖాయమని తేలిపోయింది. ఒకేసారి 108 సీట్లు తగ్గిపోతున్నట్లు సర్వేలో తేలిందంటే యోగి సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది.

ఇక 70 స్ధానాలున్న ఉత్తరాఖండ్ లో, 40 స్ధానాలున్న గోవాతో పాటు 60 సీట్లున్న మణిపూర్ లో కూడా బీజేపీ బలం బాగా తగ్గిపోతుందట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ కన్నా కేవలం కొద్దిసీట్ల మెజారిటితో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాబోతోందని సర్వే రిజల్టు చెబుతోంది. అయితే బీజేపీ-కాంగ్రెస్ మధ్య తేడా చాలా తక్కువ మాత్రమే ఉండబోతోందటంటే రేపటి ఎన్నికల్లో ఈ తేడా మారిపోయినా ఆశ్చర్యంలేదు.

పై మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతున్న బీజేపీ కాంగ్రెస్ కన్నా కేవలం 10 నుంచి 15 సీట్ల ఆధిక్యతతో మాత్రమే సాధించబోతున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఎన్నికల సమయానికి ఈ తేడాలో మార్పులు వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే సర్వే రిపోర్టులన్నీ ప్రతిసారి వాస్తవం అవుతుందని అనుకునేందుకు లేదు.

కాంగ్రెస్ పై రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోయినా సీట్లను గణనీయంగా పెంచుకుంటోందని సర్వేలో తేలింది. ఇపుడు ఎలాగు అధికారంలో కాంగ్రెస్ లేదుకాబట్టి రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా నష్టమేమీ ఉండదు. అయితే పెరుగుతాయని అనుకుంటున్న సీట్ల వల్ల పార్టీకి లాభమే అనుకోవాలి. అయితే పంజాబ్ లో అధికారం కోల్పోబోతున్నట్లు సర్వేలో తేలింది. ఇక్కడ ఆమ్ ఆదీ పార్టీ (ఆప్) అత్యధిక సీట్లతో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలబడుతుందని తేలింది. మొత్తంమీద బీజేపీకి సీట్లు తగ్గిపోయి, కాంగ్రెస్ పుంజుకుంటుందని సర్వేలో తేలింది.

This post was last modified on November 16, 2021 11:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

51 mins ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

4 hours ago