గంజాయి అమ్మకాలకు అమ్మకందారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్ధ అమెజాన్ ద్వారా వ్యాపారస్తులు తమ వినియోగదారులకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. మామూలుగా అమెజాన్ లో నిత్యావసరాలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను అమ్ముతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులరైన అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా గుర్తించారు.
అమెజాన్ లో డ్రై స్టీవియా అనే పేరుతో గంజాయి అమ్మకాలను యధేచ్చగా అమ్మేస్తున్నారు. డ్రై స్టీవియా అనేది గడ్డిజాతి ఆకులు. ఈ ఆకులు తీయగా ఉంటాయి. అంటే వీటిని పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. ఈ ఆకులను ఉపయోగించి స్వీట్లు, టీ/కాఫీల్లో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడుతుంటారు. ఈ విషయం తెలిసిన వ్యాపారస్తులు గంజాయిని తమ వినియోగదారులకు హ్యాపీగా సరఫరా చేసేస్తున్నారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం ప్రాంతం నుండి గ్వాలియర్, కోటా, భోపాల్, ఆగ్రా తదితర ప్రాంతాలకు అమెజాన్ ద్వారానే గంజాయి సరఫరా అవుతోందట. భోపాల్ పోలీసులు రెగ్యులర్ గా జరిపే సోదాల్లో భాగంగానే అమెజాన్ డెలివరీ బాయ్స్ ను చెక్ చేసినపుడు ఈ విషయం బయటపడింది. దాంతో సదరు పార్శిల్ ను ఎవరికి డెలివరీ ఇవ్వబోతున్నారనే విషయాలను తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే లోకల్ అమెజాన్ ఆఫీసు మీద కూడా దాడిచేశారు. దాంతో ఇప్పటివరకు రు. 1.10 కోట్ల బిజినెస్ జరిగినట్లు తేలింది.
తమకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా డెలవరీ బాయ్స్ తో పాటు అమెజాన్ సంస్ధతో పాటు ఇద్దరు కొనుగోలుదారుల మీద కూడా పోలీసులు కేసులు నమోదుచేశారు. గంజాయి సరఫరా ద్వారా అమెజాన్ ఇప్పటివరకు సుమారు రు. 66 లక్షల కమీషన్ అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయమై అమెజాన్ సంస్ధ స్పందిస్తు తమ ద్వారా గంజాయి సరఫరా జరిగిన విషయంపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధిత వస్తువులు తమ ద్వారా ఎలా సరఫరా అయ్యిందనే విషయంపై విచారణలో దృష్టిపెట్టినట్లు చెప్పింది.
ఏదేమైనా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు గంజాయి సరఫరాకు కొత్త మార్గాలను కనుక్కుంటున్న విషయం బయటపడింది. ఇపుడు బయటపడింది అమెజాన్ ద్వారా జరుగుతున్న సరఫరా మాత్రమే. అయితే బయటపడకుండానే మిగిలిన ఈ కామర్స్ సంస్దల ద్వారా గంజాయి ఇంకెంత స్ధాయిలో సరఫరా అవుతోందో ఎవరికీ తెలీదు. మొత్తానికి డ్రై స్టీవియా ఆకులను వ్యాపారస్తులు ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారో బయటపడింది.
This post was last modified on November 16, 2021 1:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…