Trends

ఫేస్ బుక్ పై రూ.515 కోట్ల భారీ ఫైన్.. ఏమిటంత పెద్ద తప్పు?

సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కంపెనీ ఏదైనా కానీ చట్టాలకు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అందుకు తప్పుగా వ్యవహరిస్తే ఇదే తరహాలో చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఇంతకీ ఫేస్ బుక్ చేసిన తప్పేమిటంటే.. గత ఏడాది యానిమేటెడ్ కంపెనీ ‘‘జిఫీ’’ని కొనుగోలు చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో పోటీని ఫేస్ బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణ బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది.

తమకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే.. ఫేస్ బుక్ మాత్రం ఆ వినతులను లైట్ తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానాను విధించారు. తాము అడిగిన వివరాల్ని ఇచ్చే విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసినట్లుగా పేర్కొంది.

భారీ జరిమానాను విధించిన నేపథ్యంలో ఫేస్ బుక్ స్పందించింది. తామీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించి తదుపరి ఉన్న అవకాశాలు ఏమిటన్నది పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. వివరాలు అడిగిన వెంటనే తగిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే సరిపోయేదానికి.. ఈ భారీ జరిమానా పడిన తర్వాత కానీ రియాక్టు కాకపోవటం చూస్తే.. ఫేస్ బుక్ కు ఆ మాత్రం శాస్తి జరగాలని ఫీలయ్యే వారు లేకపోలేదు. ఫేస్ బుక్ వాదనకు బ్రిటన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on October 21, 2021 4:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Facebook

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago