కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారు. కొందరికి కరోనా సోకినా.. ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నామని ఆనందపడేలోపే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా సోకిన తర్వాత ఇంటి వద్దే చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వారికి గనుక కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉందట.
ఈ మేరకు అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్‌లో ఒక పరిశోధన ప్రచురితమైంది. కరోనా మహమ్మారి వల్ల వచ్చే మరో తీవ్రమైన సమస్య ఇదని నిపుణులు అంటున్నారు. ప్రతి 10వేలమందిలో సుమారు 7.8 మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు సెయింట్ లూసియానాలోని వెటరన్ ఎఫైర్స్ కార్యాలయంలో పనిచేసే జియాద్ అల్ అలీ తెలిపారు. ఆయనే ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
“కరోనా సోకిన అమెరికన్లు, ప్రపంచ వ్యాప్త బాధితులతో పోల్చి చూస్తే ఇదేమీ తక్కువ సంఖ్య కాదు” అని జియాద్ అన్నారు. కిడ్నీ సమస్యలో అత్యంత సమస్యాత్మకమైన విషయం ఏంటంటే.. ఈ కిడ్నీ సమస్యను గుర్తించడం చాలా కష్టం. కనీసం నొప్పి కూడా పుట్టదట. ఇది ముదిరిన తర్వాత డయాలసిస్, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరం అవుతాయి. కరోనా ఆస్పత్రిలో చేరిన వారికంటే, ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందిన వారికి ఈ వైరస్ సోకే ప్రమాదం 23శాతం అధికంగా ఉన్నట్లు జియాద్ తెలిపారు.
This post was last modified on September 4, 2021 11:51 am
అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా…
ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి బహిరంగ వేదికపై స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాటలు చెప్పొద్దు.. చేతలకు రండి!' అని…
భారత్‌ను ఢీ కొంటామని.. తగిన విధంగా బుద్ది చెబుతామని బీరాలు పలికిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చుట్టూ…
హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా రెండో వారంలోకి అడుగు…
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…