వరల్డ్ రికార్డ్.. అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రెస్ ఇవి..!

చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు.. ఫెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడతారు. ఈ ఫ్రెంచ్ ప్రైస్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 నుంచి రూ.250 ఉంటుందేమో.. కానీ.. ఈ ఫ్రెంచ్ ప్రైస్ ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే.. దీని ధర అక్షరాలా రూ.14,800.

నమ్మసక్యంగా లేకపోయినా నిజం. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ప్రైస్ ఇవి. ఇవి న్యూయార్క్ రెస్టారెంట్ లో ఉన్నాయి. ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే అతి ఖరీదైన బర్గర్ మరియు ఐస్ క్రీమ్ తయారు చేసి రికార్డులకెక్కింది.

ఇప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని బంగాళదుంపలు, వెనిగర్, షాంపైన్ వంటి వాటిని ఉపయోగించి తయారు చేస్తారు.

ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మీద 23 క్యారెట్ గోల్డ్ డస్ట్ వేస్తారు. అందుకే.. ఇవి ఇప్పుడు ఇంత ఖరీదు పలుకుతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కాస్ట్ లీ ఫ్రెంచ్ ప్రైస్ తినడానికి కూడా ఔత్సాహికులు.. ఆసక్తి చూపిస్తున్నారట.