దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే.. థర్డ్ వేవ్ ప్రారంభానికి ఇదే సంకేతమేమో అనే అనుమానం కలుగుతోంది.
సోమవారం 30 వేలకు తగ్గిన కేసులు .. తిరిగి 40 శాతం మేర పెరిగాయి. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. తాజాగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 4.18 లక్షలకు పెరిగింది.
ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 4,07,170 గా ఉంది. 36,977 మంది వైరస్ నుండి కోలుకున్నారు. అయితే, మంగళవారం కోలుకన్న వారి కన్నా కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates