తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని శ్వేతా రెడ్డి(17) అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ సదరు విద్యార్థిని కి స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. ఏకంగా రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ పొందడం గమనార్హం.
శ్వేతారెడ్డి కి అత్యంత ప్రతిష్టాత్మకమైన లాఫాయెట్ కాలేజీలో స్కాలర్ షిప్ పొందింది. ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా.. శ్వేతారెడ్డి స్కాలర్ షిప్ ను కూడా దక్కించుకుంది.
డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయెట్ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు మాత్రం ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది. కాగా ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో శ్వేతారెడ్డి ఉండడం తెలుగు విద్యార్థులకు గర్వకారణంగా మారింది. శ్వేతా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే లాఫాయెట్ ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
స్కాలర్ షిప్ సాధించడం పట్ల శ్వేతా హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని.. దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates