సంసారానికి పనికిరావని భార్య హేళన చేసిందని..

సంసారానికి పనికి రావంటూ.. భార్య హేళన చేయడంతో.. ఓ వ్యక్తి ఏకంగా మహిళలపై పగ పెంచుకున్నాడు. తనను భార్య ఏ విషయంలో హేళన చేసింది.. అది నిజం కాదని నిరూపించాలని అనుకున్నాడు. అంతే.. ఒంటరి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. కాగా.. ఈ కామాంధుడు చేస్తున్న అఘాయిత్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే… హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడాకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభిరామం ఈ నెల 4వ తేదీన కిడ్నాప్ చేసి మర్నాడు ప్రగతినగర్ నీళ్ల ట్యాంక్ వద్ద వదిలేశాడు. తీవ్రమైన గాయాలతో చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ నెల 9వ తేదీన మరో చిన్నారని అపహరించే ప్రయత్నంలో అతను పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతన్ని విచారించే క్రమంలో దర్యాప్తు అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

నుదుటిపై తుపాకి పెట్టి కాల్చేయాలని అతను పదే పదే అడుగుతూ వచ్చాడు. కీసర మండలం బండ్లగుడా 60 యార్డ్సు కాలనీలో ఉంటున్న అభిరాం మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చీకటి పడితే కామోన్మాదిగా మారేవాడు. అది కూడా భార్య తనను సంసారానికి పనికిరావంటూ హేళన చేసి వదిలేయడంతో అలా తయారయ్యానని అతను చెప్పడం గమనార్హం. దాని నుంచి బయటపడేందుకు డ్రగ్స్ ను అలవాటు చేసుకున్నాడు. అయినా తనలో మార్పు రాలేదని అతని దర్యాప్తు అధికారులకు చెప్పాడు.

అభి నివాసం చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. రాత్రి కాగానే అటవీ మార్గంలో నడుచుకుంటూ జవహర్ నగర్ ప్రాంతాలకు నడుచుకుంటూ వచ్చేవాడినని చెప్పాడు. ఆ ప్రాంతమంతా తెలియడంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చేవాడినని అభిరామ్ దర్యాప్తు అధికారుల వద్ద అంగీకరించాడు.