జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ ఇప్పుడు కీలకమైన ఘట్టం కోసం రెడీ అవుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం డ్రాగన్ కు ఒక ఇమేజ్ ఉన్న యంగ్ హీరో అవసరం అయ్యే స్పెషల్ రోల్ ఉందట.
కనిపించేది కాసేపే అయినా తారక్ తో సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండటమే కాక అభిమానులు గుర్తుపెట్టుకునేలా ఉంటుందని వినికిడి. చెప్పాలంటే పెదరాయుడులో రజనీకాంత్, జైలర్ లో శివరాజ్ కుమార్ తరహాలో అన్నమాట.
అయితే దీనికి ఎవరు ఒప్పుకుంటారనే ఆప్షన్ల మీద కసరత్తు జరుగుతోందని తెలిసింది. తారక్ స్వయంగా అడిగితే రిషబ్ శెట్టి కాదనకపోవచ్చు. అందులోనూ శాండల్ వుడ్ డైరెక్టర్ కాబట్టి గ్రీన్ సిగ్నల్ రావొచ్చు. మార్కెట్ పరంగా కూడా ఇది పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఈ టైంలో రిషబ్ ని అడగటం సబబేనానేది యంగ్ టైగర్ డిసైడ్ అవ్వాలి.
విశ్వక్ సేన్ ని అడిగితే స్టోరీ అడక్కుండా చేస్తాడు. కానీ తనేమో డౌన్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో తన కాంబో అంటే ఆడియన్స్ లో అంత ఎగ్జైట్ మెంట్ ఉండకపోవచ్చు. అఖిల్ పేరు కూడా పరిశీలనలో ఉందట కానీ లెనిన్ తో తనున్న బిజీలో ఇదీ డౌట్ గానే ఉంది.
ఈ సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగేలా ఉంది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం డ్రాగన్ జూన్ 25 విడుదల కావాలి. కానీ ఇప్పుడా సూచనలు లేవు. దసరా లేదా దీపావళిని టార్గెట్ చేస్తున్నారు. అవీ మిస్ అయితే 2027 సంక్రాంతికి వెళ్ళిపోవాలి. ప్రశాంత్ నీల్ చెప్పాకే మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
దేవర తర్వాత మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. మధ్యలో వార్ 2 వచ్చినప్పటికీ అది బాలీవుడ్ మల్టీస్టారర్ కాబట్టి దాన్ని అభిమానులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కెజిఎఫ్ తర్వాత నీల్ చేస్తున్న డ్రాగన్ తారక్ కు తొలి వెయ్యి కోట్ల మూవీ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates