కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్కడి సినిమాల విలువ అందరికీ తెలిసిందీ కరోనా తర్వాతే. భాషా భేదం లేకుండా అందరూ మలయాళ సినిమాలను ఆదరిస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు మలయాళ హీరోలు ఓటీటీల ద్వారానే వేరే భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది టొవినో థామస్ గురించి. అతను ఓటీటీల్లో రిలీజైన మలయాళ అనువాదాల ద్వారానే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
ఐతే ఈ మధ్య టొవినోను మించి ఒక నటుడు తెలుగులో ఫేమ్ తెచ్చుకున్నాడు. అతనే.. బాలిస్ జోసెఫ్. జయ జయ జయ జయహే, నూనాక్కుళి, సూక్ష్మ దర్శిని, గురువాయూర్ అంబలనదాయిల్, ప్రవిన్‌కుడు షాపు.. ఇలా పలు చిత్రాలతో బాసిల్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. తెలుగు అనే కాక ఇతర భాషల్లోనూ అతడికి పాలోయింగ్ పెరిగింది. బాసిల్ నటించిన ఏదో ఒక సినిమా చూస్తే చాలు.. అతడికి ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఏమాత్రం నెగెటివిటీ లేని అందరివాడు డైరెక్టర్ కమ్ యాక్టర్.
ఈ నటుడు ఇప్పుడు ఒక భారీ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అది సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కావడం విశేషం. ప్రస్తుతం జైలర్-2లో నటిస్తున్న రజినీ.. దీని తర్వాత శిబి చక్రవర్తి అనే యువ దర్శకుడితో జట్టు కట్టనున్న సంగతి తెలిసిందే. అతను ‘డాన్’ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రజినీ హీరోగా కమల్ హాసన్ నిర్మించే చిత్రానికి ముందు సుందర్‌ను దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఆయన తప్పుకున్నాక శిబి లైన్లోకి వచ్చాడు.
త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రంలో రజినీ కొడుకు పాత్రలో బాసిల్ కనిపించనున్నాడట. బాసిల్ చేశాడంటే ఆ పాత్ర స్పెషల్‌గానే ఉంటుంది, సినిమాకు అతను ప్రత్యేక ఆకర్షణ అవుతాడు అనడంలో సందేహం లేదు. ‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేయనుంది. ఇందులో రజినీకి హీరోయిన్ అంటూ ఎవరు ఉండరట. కొన్నేళ్లుగా వయసుకు తగ్గట్లు మిడిలేజ్డ్ రోల్సే చేస్తున్న రజినీ.. ఇందులోనూ అదే ఒరవడి కొనసాగించనున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates