కష్టంలో ఉన్నాం.. నువ్వే దిక్కు.. సాయం చేయి మారాజా అంటూ అభ్యర్థిస్తుంటారు కొందరు. అలాంటి వారికి ఆపన్న హస్తం అందించేందుకు సదా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటంలో సినీ నటుడు సోనూ సూద్ ముందుంటారు. సమస్య ఎలాంటిదైనా.. కోరిక ఎంత పెద్దది అయినా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించే సోనూ లాంటి వారి దగ్గర కొందరు వ్యవహరించే అతి ఆగ్రహానికి గురి చేస్తుంటుంది. తాజాగా ఒక కుర్రాడు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం.
తాజాగా ఒక నెటిజన్ రోటీన్ కు భిన్నమైన కోరికను సోనూ ఎదుట ఉంచారు. ‘బ్రదర్.. నా గర్ల్ ప్రెండ్ ఐఫోన్ అడుగుతోంది. మీరేమైనా సాయం చేయగలరా’ అంటూ అడిగేశాడు. దీనికి సోనూ నుంచి వచ్చిన సమాధానం కర్ర కాల్చి వాత పెట్టేట్లు ఉండటం గమానార్హం. ‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కానీ.. నేను ఆమెకు ఐఫోన్ ఇవ్వటం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు’’ అంటూ బదులిచ్చారు. దీనికి ఒక ఏమోజీని జత చేశారు.
ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. కుర్రాడి కోరికను పలువురు తప్పు పడుతున్నారు. కొందరికి ఏం సాయం అడగాలో కూడా తెలియదు. వారి మనసులో ఏది అడగాలనిపిస్తే.. అది అడుగుతారు.. సోనూ అదిరే సమాధానం ఇచ్చారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అపదలో ఉన్న వారికి.. కష్టంలో ఉన్నోళ్లకు అండగా నిలుస్తున్న సోనూ లాంటి వారిని అడిగే కోరికేనా ఇది? అన్న క్వశ్చన్ ను పలువురు సంధిస్తున్నారు.
This post was last modified on June 23, 2021 3:26 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…