గడిచిన మూడు రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో.. చానళ్లలో.. యూట్యూబ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు పబ్జీ కఫుల్. తమిళనాడుకు చెందిన ఈ యూత్ జంట చేసే మోసాలు.. వారి ఆరాచకాల్ని వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పబ్జి గేమ్ ఆడుతూ.. మహిళలు.. చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం.. దానికి సంబంధించిన ఆడియోల్ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లాదిరూపాయిల్ని కొల్లగొట్టే ఈ కఫుల్ ను ఈ మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
పోలీసుల విచారణలో సదరు దంపతులు చెప్పిన మాటల ఆధారంగా సంచలన అంశాల్ని గుర్తించారు. పబ్జీ మదన్.. ఆయన సతీమణి కృత్తిక బ్యాంకు ఖాతాల్లో రూ.4 కోట్ల మేర నగదు నిల్వల్ని గుర్తించారు. దీంతో.. విస్మయానికి గురైన పోలీసులు.. వీరి గురించి మరింత ఫోకస్ పెట్టారు. దీంతో.. వీరికి సంబంధించిన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అడ్డదిడ్డంగా వ్యవహరించిన ఈ జంట గడిచిన మూడేళ్లలో రూ.75 కోట్ల మొత్తాన్ని సంపాదించినట్లు గుర్తించారు. తామింత భారీగా ఆదాయాన్ని కళ్ల జూస్తున్నా.. అందులో నుంచి పన్ను మొత్తాన్ని చెల్లించే విషయంలోనూ వారు తప్పులు చేసిట్లుగా గుర్తించారు. దీంతో.. వీరు మరే ఇతర కార్యకలాపాలు చేసేవారన్న విషయాల్ని తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్ లైన్ లో బూతు ఆడియోలు.. వీడియోపోస్టులకు ఇంత భారీగా సంపాదించిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
This post was last modified on June 22, 2021 11:29 am
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…