ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కి చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను ట్విట్టర్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరసగా ట్విట్టర్ పై కేసులు నమోదౌతున్నాయి.
నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదు కాగా.. తాజాగా రెండో కేసు నమోదైంది. ఈ రెండు కేసు హైదరాబాద్ పోలీసులు పెట్టడం గమనార్హం. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు. అంతేకాక, కేసు పెట్టి.. ట్విటర్ ఇండియా యాజమాన్యానికి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.
ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై కూడా ట్విటర్ వెంటనే స్పందించాలని నోటీసులో కోరారు. నోటీసుతోపాటు ట్విటర్ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు. పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు.
అయితే, కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విటర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది.
This post was last modified on June 17, 2021 5:39 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…