ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. అలాగే ప్రయాణ టికెట్ లేకుండా రైల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ మాత్రమే తీసుకుని రైలెక్కేస్తే..? టికెట్ కలెక్టర్ పట్టుకుని ఫైన్ వేయడం ఖాయం. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఫ్లాట్ ఫామ్ టికెట్‌తోనే రైలు ఎక్కేయొచ్చు. కానీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మాత్రం టీసీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని.. అలాగే అత్యవసర స్థితిలో ప్రయాణాలు చేసేవాళ్లకు ఇబ్బంది రాకుండా ఈ కొత్త వెసులుబాటును రైల్వే శాఖ అందిస్తోంది.
మామూలుగా ముందు టికెట్ రిజర్వ్ చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కానీ.. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్‌కు వచ్చి టికెట్ కొనాలనుకునే వాళ్లకు సమస్యలు తలెత్తుతుంటాయి. భారీ క్యూలైన్లు ఉంటే టికెట్ తీసుకోవడం కష్టమవుతుంది. అలాంటపుడు టికెట్ వెండింగ్ మిషన్లో ఈజీగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కేయొచ్చు. తర్వాత టీసీ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రయాణికులు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో ట్రైన్ ఎక్కాక గార్డ్ పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అలా ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందో వివరించాలి. ఒకవేళ గార్డ్ అందుబాటులో లేకపోతే.. రైల్వే స్టాఫ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. గార్డ్ సర్టిఫికేట్ తర్వాత టీటీఈ నుంచి ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఐతే ఎవరైనా ప్యాసింజర్ రైలు ఎక్కాక కూడా టికెట్ తీసుకోకుండా కావాలనే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో జర్నీ చేస్తున్నాడని టీటీకి తెలిస్తే మాత్రం.. ఏకంగా రూ.1000కి పైగా జరిమానా విధించే అవకాశముంది. అలాగే.. ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండించటికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు.
This post was last modified on June 17, 2021 3:47 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…