తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళనని.. ఛాట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి.. తన ఫోన్ నెంబర్ ను షేర్ చేసింది. దానికి స్పందించిన యువకుడు.. ఫోన్ చేయగా.. కవ్విస్తూ మాట్లాడింది. అనంతరం చాట్ చేస్తూ.. వీడియో కాల్ చేయాలని చెప్పింది.
నగ్నంగా కనిపిస్తూ చాటి చేస్తూ.. తాను నగ్నంగా చూడాలనుకుంటున్నట్లుగా తన ఇష్టాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మైకంలో పడిన ఆ యువకుడు వెనుకా ముందు చూసుకోకుండా.. నగ్నంగా తయారై చాటింగ్ చేశాడు. ఆ వెంటనే.. ఆ యువకుడి వీడియోను పంపిన సదరు యువతి.. డబ్బుల్ని డిమాండ్ చేసింది. దీంతో.. షాక్ తిన్న యువకుడు అప్పు చేసి రూ.24వేలు చెల్లించాడు.
అయినప్పటికీ ఆ ముఠా వేధింపులు తగ్గలేదు. తాము కోరిన డబ్బులు ఇవ్వకుంటే.. వీడియోల్ని యూట్యూబ్ లో పెడతామంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు హైదరాబాద్ విడిచి పెట్టి ఊరికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా ఆ యువకుడు మరణించాడు. వలపు వల విసిరిన వారు.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువు దోపిడీ చేస్తారన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.
This post was last modified on %s = human-readable time difference 9:55 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…