Movie News

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’ సహా చాలా సినిమాలకు అలాగే చేశాడు. కానీ ‘వారణాసి’ విషయంలో మాాత్రం ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించాడు. సైలెంటుగా షూటింగ్ మొదలుపెట్టి కొన్ని నెలల చిత్రీకరణ తర్వాత ఒక షో రీల్ లాంటి వీడియోతో వారణాసి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. కానీ అందులోనూ కథేంటన్నది వెల్లడించలేదు.

ఈ సినిమా విడుదలకు 8 నెలల సమయం ఉండగా, జక్కన్న ఇప్పుడు ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. ‘వారణాసి’ ముచ్చట్లు పంచుకున్నాడు కానీ, అందులో కూడా కథ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ గ్లింప్స్‌లో సంకేతాలు ఇచ్చినట్లే.. ఈ కథ వారణాసిలో మొదలై అంటార్కిటికాకు వెళ్లి, ఆఫ్రికాలోనూ ప్రయాణించి.. గతంలోకి వెళ్లి రామాయణ కాలాన్ని టచ్ చేసి, చివరగా తిరిగి వారణాసికే వస్తుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

2022లో ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఈ కథ మీద కసరత్తులు మొదలుపెడితే ఇప్పటికి నాలుగున్నరేళ్లు గడిచాయని.. ప్రస్తుతం ‘వారణాసి’ చిత్రీకరణ 80 శాతం పూర్తయిందని.. ఇంకో 20 శాతం షూట్ మాత్రమే మిగిలుందని, అన్నీ అనుకున్న ప్రకారమే సాగుతున్నాయని రాజమౌళి తెలిపాడు. సినిమాలో భారీ, యాక్షన్ ఘట్టాలన్నీ పూర్తి చేశామని, ఇక తీయాల్సింది చిన్న చిన్న సన్నివేశాలే అని జక్కన్న చెప్పాడు.

మొత్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో తీసిన తొలి నాన్-ఇంగ్లిష్ సినిమా ‘వారణాసి’నే అని చెప్పిన రాజమౌళి.. ఆ ఫార్మాట్ ఎంచుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఈ సినిమాలో 300 అడుగుల ఎత్తుండే అంటార్కిటికా పర్వతాలను క్యాప్చర్ చేయాల్సి వచ్చిందని.. అలాగే భారీగా ఉండే వానర సేనలనూ చూపించామని.. అలాంటి సన్నివేశాలను చూపించడానికి ఐమాక్స్ ఫార్మాటే కరెక్ట్ అని అన్నాడు. కథ గురించి ఎక్కువ వెల్లడించలేని స్థితిలోనే గత ఏడాది గ్లింప్స్‌ ద్వారా వారణాసి ప్రపంచాన్ని అలా పరిచయం చేసినట్లు జక్కన్న తెలిపాడు.

This post was last modified on August 3, 2026 11:26 am

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

29 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

57 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago