Movie News

ఈవెంట్లు ఒకటే కాదు… షూటింగులు కూడా జరగాలి

ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం చూస్తూనే ఉన్నాం. నంది అవార్డులను రేవంత్ రెడ్డి సర్కార్ గద్దర్ గా పేరు మార్చి, ఆల్రెడీ రెండుసార్లు వేడుక నిర్వహించి పురస్కారాలు అందజేసింది, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ వీటిని పునరుద్ధరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెబుతూ వస్తున్నారు కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. సీరియస్ గా చూడాల్సిన అంశం మరొకటి ఉంది.

ఇండస్ట్రీ నుంచి ఏపీకి ఆదాయం రావాలంటే కేవలం సినిమా రిలీజులు జరిగితే సరిపోదు. షూటింగులు ఉండాలి. రోజులు, నెలల తరబడి ఆయా యూనిట్లు మన ప్రాంతాల్లో బస చేసి చిత్రీకరణ జరిపితే సొమ్ములతో పాటు కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. స్టూడియోల నిర్మాణంతో పాటు షూటింగులు వేగవంతమయ్యేలా సహకరించేందుకు డిప్యూటీ సిఎం రూపంలో పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నా ఆ దిశగా పెద్దలు చొరవ తీసుకోవడం లేదు. హైదరాబాద్ అంతగా పెనవేసుకుపోయింది.

గత కొంత కాలంగా సినిమా ఈవెంట్లు ఏపీలో రెగ్యులర్ గా జరుగుతున్నాయి. లెనిన్ వేడుకలు వైజాగ్ – విజయవాడలో చేశారు. పెద్ది కూడా బెజవాడలోనే జరిగింది. కొరియన్ కనకరాజు ఈవెంట్ భీమవరంలో చేయబోతున్నారు. దీనికన్నా ముందు అనంతపురంలో ప్రమోషన్లు పెద్ద ఎత్తున చేశారు. బాలయ్య 112 ఓపెనింగ్ అమరావతిలో జరిగింది. ఇవన్నీ సాయంత్రం పూట కేవలం కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైన కార్యక్రమాలు. ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు.

అదే ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, భీమిలి, బొర్రా గుహలు, కాకినాడ, రాయలసీమ ప్రాంతాలు, తిరుపతి, మహానంది లాంటి పుణ్యక్షేత్రాలు మొదలైన చోట్ల షూటింగులు చేయడం మొదలుపెడితే క్రమంగా ఇండస్ట్రీ ఏపీలో కూడా బలపడేందుకు అవకాశం దొరుకుతుంది. హైదరాబాద్ వదిలి రావాల్సిన అవసరం లేదు. మెల్లగా షూటింగులను ఏపీలోని ఇతర ఊళ్లకు విస్తరింపజేసి, స్టూడియోలు కట్టడం గురించి సీరియస్ గా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప కేవలం ఈవెంట్లు జరిగినంత మాత్రాన సంబరపడేందుకు ఏమీ లేదు. 

This post was last modified on August 3, 2026 12:29 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

6 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

6 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

6 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

9 hours ago