Political News

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దండెత్తిన యువత… కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వదలలేదు. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తెగ సంబరపడిపోయింది. అయితే జంతర్ మంతర్ నిరసనలు ఇంకా పూర్తిగా మరిచిపోనే లేదు…. అప్పుడే ఇండియా కూటమి వంతు కూడా వచ్చేసింది. ఇండియా కూటమి పాలనలోని జార్ఖండ్ లో ఇప్పుడు జంతర్ మంతర్ తరహా ఆంధోళనలే కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు పలికింది.  బీజేపీకి యువత ముచ్చెమటలు పట్టించారని సంబరపడ్డ కాంగ్రెస్ కూ ఇప్పుడు అదే యువత మూడు చెరువుల నీళ్లు తాగించేలా ఉందని చెప్పక తప్పదు.

జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న తాజా ఆందోళనల విషయానికి వస్తే… జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షా పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న ఈ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని.. తిరిగి పరీక్షను నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ తో దేవేంద్ర నాధ్ మహతో అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద విద్యార్థులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ నిరసనలను అక్కడి జార్ఖండ్ ముక్తి మోర్చా (ఈ పార్టీ ఇండియా కూటిమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతోంది) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ నిరసనలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ నిరసనలకు తరలివస్తున్నారు.

తాజాగా నిరసనలకు నేతృత్వం వహిస్తున్న మహతో ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సోరేన్ తమతో చర్చలు జరిపి… విద్యార్థులకు న్యాయం చేసే దాకా దీక్ష విరమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ జార్ఖండ్ విద్యార్థుల నిరసనలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకుంటే… ఏ పార్టీ ప్రభుత్వాన్ని అయినా విడిచిపెట్టేది లేదని కాక్రోచ్ పార్టీ తేల్చి చెప్పింది. వెరసి ఈ నిరసనలు కూడా జంతర్ మంతర్ నిరసనల స్థాయికి చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 3, 2026 3:25 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

16 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago