ఐకాన్.. ఎప్పుడో మూడేళ్ల ముందు తెరపైకి వచ్చిన సినిమా. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్న సమయంలో ఈ చిత్రం గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘ఎంసీఏ’తో హిట్టు కొట్టిన ఊపులో ఉన్న వేణు శ్రీరామ్‌తో ఈ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు బన్నీ. నేరుగా టైటిల్‌తో ఒక పోస్టర్ వదలడంతో బన్నీ తర్వాతి సినిమా ఇదే అనుకున్నారంతా. కానీ దీన్ని కాకుండా ‘అల వైకుంఠపురములో’ను మొదలుపెట్టాడు స్టైలిష్ స్టార్. ఆ తర్వాత ‘పుష్ప’ లైన్లోకి వచ్చింది. ఇది పూర్తయ్యాక కొరటాల శివ సినిమా ఉంది. ఆపై ప్రశాంత్ నీల్ అంటున్నారు.
మరి ‘ఐకాన్’ సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. ఈ సినిమా అటకెక్కేసిందా అంటే అలాంటిదేమీ లేదన్న సంకేతాలే వస్తున్నాయి. బన్నీ మిత్రుడు వాసు సైతం ఈ ప్రాజెక్టు ఉంటుందని.. తనకు కుదిరిన సమయంలో ఈ చిత్రం చేస్తాడని అన్నాడు. ఐతే బన్నీకి కుదిరేది ఎప్పుడన్నదే తెలియడం లేదు.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వేణు శ్రీరామ్‌కు అనుకున్నట్లే మీడియా నుంచి ‘ఐకాన్’ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా ఆగిపోలేదని మాత్రం వేణు స్పష్టం చేశాడు. కానీ ఆ సినిమా ఎప్పుడో మొదలవుతుందో తనకు కూడా తెలియదని అనేశాడు. అంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంతకీ ‘వకీల్ సాబ్’ తర్వాత సినిమా ఏంటి అని అడిగితే.. ప్రస్తుతానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించట్లేదని.. తన దృష్టంతా ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
ఇక ‘వకీల్ సాబ్’ కోసం పవన్‌తో కలిసి పని చేయడం ఒక లైఫ్ టైం మెమొరీ అన్న వేణు.. ఈ సినిమా స్క్రిప్టు ఆషామాషీగా చేయలేదని.. చాలా సమయం పట్టిందని.. నాలుగు వెర్షన్స్ రాస్తే కానీ.. ఇప్పుడు తెరమీద చూడబోతున్నట్లుగా స్క్రిప్టు రాలేదని చెప్పాడు. ఒరిజినల్ కంటెంట్ దెబ్బ తినకుండా దీనికి కొత్త అంశాలు కలిపినట్లు వేణు తెలిపాడు.
This post was last modified on April 1, 2021 8:48 am
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…