భారత క్రికెట్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాను కూడా ఫాలో అయ్యేవారికి టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి పై వచ్చే జోకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద తాగుబోతు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. దీని మీద తరచుగా మీమ్స్, జోక్స్ పేలుతుంటాయి. రవితేజ కొన్ని సందర్భాల్లో మత్తులో ఉన్నట్లుగా ఉన్న ఫొటోలను ఈ మీమ్స్ కోసం వాడుతుంటారు. అవి కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ఐతే తన మీద వచ్చే జోకులు, మీమ్స్ విషయంలో రవిశాస్త్రి మరీ సీరియస్‌గా ఏమీ ఉండడు అనడానికి రుజువు తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్.
మొన్న మొతేరా మైదానంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోవడం, కోహ్లీ సేన ఘనవిజయం సాధించడం తెలిసిందే. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. మీమ్స్ లెక్కే లేవు. ఐతే రవిశాస్త్రికి ముడిపెడుతూ ఒక మీమ్‌ను ప్రముఖ రచయిత శోభా డే షేర్ చేసింది. నాకు ఐదు రోజుల పాటు డ్రై డే అనుకున్నారు కదా అని రవిశాస్త్రి అంటున్నట్లు ఉంది ఆ మీమ్. అంటే మ్యాచ్ ఐదు రోజులు జరిగితే ఆ ఐదు రోజులూ రవిశాస్త్రి తాగడని, ఇప్పుడు రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది కాబట్టి ఆయన మద్యం మత్తులో జోగుతాడని ఆ మీమ్ అర్థమన్నమాట.
తమపై ఇలాంటి జోక్ వేస్తే అందరూ సరదాగా తీసుకోలేరు. కానీ రవిశాస్త్రి మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ ట్వీట్ మీద ఫన్నీగా స్పందించాడు. నా వల్ల మీ ముఖాల్లో నవ్వు వస్తుందంటే రానివ్వండి అంటూ ట్వీట్ వేశాడు. ముందు శోభా డే షేర్ చేసిన మీమ్ ఎంత వైరల్ అయిందో.. దానికి రవిశాస్త్రి స్పందన కూడా అంతే వైరల్ అయింది. రవిశాస్త్రి స్పోర్టివ్‌నెస్‌ను మెచ్చుకుంటూ ఆయన మీద వచ్చిన మరిన్ని మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వాటిని కూడా రవిశాస్త్రి బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుంది.
This post was last modified on February 27, 2021 9:44 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…