ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో ఇండియన్ సూపర్ స్టార్లకు దీటుగా ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ను ఒక విదేశీయుడిలా చూడరు మన అభిమానులు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాక ఐపీఎల్‌తో అతడి అనుబంధం ఎంతగానో బలపడింది. అతణ్ని మన తెలుగు అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ఆటతో అలరిస్తూ, జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు వార్నర్.
ఇప్పటికే తన జట్టుకు ఒక టైటిల్ కూడా అందించిన వార్నర్.. ప్రతి సీజన్లోనూ శక్తివంచన లేకుండా జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. కేవలం ఆటతోనే కాక మైదానం అవతల వార్నర్ విన్యాసాలు కూడా అభిమానులను అలరిస్తుంటాయి. తెలుగు పాటల టిక్ టాక్ వీడియోలతో అతను మరింతగా మనోళ్ల మనసుల్లోకి చొచ్చుకెళ్లాడు. ఐతే మధ్యలో ఒక ఏడాది బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఐపీఎల్ ఆడలేకపోయిన వార్నర్.. ఈసారి గాయం కారణంగా లీగ్‌కు దూరమవుతాడన్న ప్రచారం జరిగింది.
స్వయంగా వార్నరే తన గజ్జల్లో గాయం తీవ్రత గురించి వివరించాడు. తన గాయం మానడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని చెప్పాడు. కొన్ని వారాల కిందటే వార్నర్ ఈ మాట చెప్పడంతో ఈసారి అతను ఐపీఎల్ ఆడకపోవచ్చని ప్రచారం సాగింది. వార్నర్ లేదంటే సన్‌రైజర్స్‌కు అది మామూలు దెబ్బ కాదు. జట్టులో కళే పోతుంది. అభిమానుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐతే తన గురించి టెన్షన్ పడుతున్న అభిమానులకు వార్నర్ ఊరటనిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
సన్‌రైజర్స్ జట్టుకు నాయకత్వం వహించడం తనకెంతో ఇష్టమైన పని అని, ఈ సీజన్లోనూ జట్టును నడిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అతను పేర్కొన్నాడు. ఈ పోస్టు తాలూకు స్క్రీన్ షాట్‌ను సన్‌రైజర్స్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టి అభిమానుల ఆందోళనను తొలగించింది. దీంతో వార్నర్ ఈ సీజన్లో యధావిధిగా పాల్గొనబోతున్నాడని, అతను లీగ్‌కు దూరమవుతాడని బాధ పడాల్సిన పని లేదని అభిమానులు ఊరట చెందుతున్నారు.
This post was last modified on February 27, 2021 3:51 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…