హైదరాబాద్ లోని బోరబండ సాయిబాబా ఆలయం సెల్లార్ లో ఒక గదిలోని పెట్టెలో ఆస్థిపంజరం బయట పడటం పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేధించారు. పదమూడు నెలలుగా మిస్ అయిన వ్యక్తిని గుర్తించటంలో విఫలమైన పోలీసులు.. ఆస్థిపంజరం బయట పడిన తర్వాత దాని మిస్టరీని గంటల వ్యవధిలోనే తేల్చేయటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2 బస్తీలోని సాయిబాబా దేవస్థానం సెల్లార్ గదికి అద్దె ఇచ్చారు. అద్డె చెల్లించలేదంటూ దేవస్థానం ఛైర్మన్ యాదయ్య కొద్దిరోజులక్రితం ఎస్ ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 2017లో పలాష్ పాల్ అనే వ్యక్తికి గది అద్దెకు తీసుకున్నాడు. కార్పెంటర్ గా పని చేసే అతడు.. మొదట్లో అద్దెను సక్రమంగా చెల్లించేవాడని.. తర్వాత మాత్రం అద్దెను చెల్లించటం మానేశాడు. తర్వాత తాళం వేసుకొని వెళ్లాడే కానీ.. కనీసం స్పందించని పరిస్థితి. దీంతో.. పోలీసుల సమక్షంలో గదిని ఖాళీ చేయించే క్రమంలో.. ఒక చెక్క పెట్టెలో ఆస్థిపంజరం కనిపించటంతో షాక్ తిన్నారు.
దీంతో.. వెంటనే అద్దెకు తీసుకున్న పాల్ కు ఫోన్ చేయగా.. తాను పశ్చిమబెంగాల్ లో ఉన్నట్లు చెప్పాడు. కాల్ డేటాను చూస్తే.. అతను హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అలెర్టు అయి.. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందే. విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడైనట్లుగా చెబుతున్నారు. తాను అద్దెకు తీసుకున్న గదిలో తన వస్తువుల్ని దాచేవాడు. ఈ క్రమంలో అతడికి స్థానిక మహిళతో వివాహేతర సంబంధం చోటు చేసుకుంది. అది ఆమె భర్త కమల్ కు తెలిసిపోయింది. దీంతో.. ఆమెను హెచ్చరించేవారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. దీంతో..ఆమె పాల్ కు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.
ఇదిలా ఉంటే.. కమల్ కొత్త ఇంటికి కడుతున్నాడు. దానికి అవసరమయ్యే ద్వారబంధానని కొనుగోలు చేయటానికి పాల్ వద్దకు వచ్చాడు. అతడ్ని మాటల్లో పెట్టి గదిలోకి తీసుకొచ్చి.. అదును చూసి చెక్కతో బలంగా నెత్తి మీద కొట్టటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. డెడ్ బాడీని తరలించటానికి కుదరక.. తన దగ్గరున్న చెక్కపెట్టెలో పెట్టేసి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.
గత ఏడాది జనవరిలో ఈ ఘటన జరగ్గా.. తన భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదమూడు నెలలుగా కనిపించని భర్త.. చివరకు ఆస్థిపంజరంగా కనిపించటంతో ఆమె బోరుమంటున్నారు. ఇందుకు కారణమైన పాల్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.
This post was last modified on February 12, 2021 3:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…