తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల మీదే వందల కోట్ల వ్యాపారం జరిగేది ఈ సీజన్ లోనే. థియేటర్లు కూడా జనంతో కళకళలాడుతూ కనిపిస్తాయి. మూవీ లవర్స్ ఖాళీ సమయంలో ఆన్ లైన్ లో ఉంటూ కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాణాసంచా కాల్చడానికి ముందు మన స్టార్లు ఇచ్చే లక్ష్మి బాంబులు, కాకర పూవొత్తుల కోసం వెయిట్ చేస్తారు. ఇవాళ కూడా అదే జరిగింది.
కానీ ఎగ్జైటింగ్ అనిపించేలా ఎలాంటి కంటెంట్ ఈసారి టాలీవుడ్ నుంచి రాలేదు. అందరూ పోస్టర్లతో సరిపెట్టి మమ అనిపించారు తప్పించి ఏదైనా వీడియో కంటెంట్ లేదా మేకింగ్ విజువల్స్ లాంటివి ఎవరూ ఇవ్వలేదు. చిరంజీవి కాకా, బాలకృష్ణ దాదా రెండు అప్డేట్ పోస్టర్స్ తో సరిపెట్టారు. వాటిలో వావ్ అనిపించేది అంతగా ఏం లేదు. వెంకటేష్, నాగార్జున బృందాలు కింగ్ 100, జనవరి 12 విడుదల గురించి పెద్దగా సౌండ్ చేయలేదు. చాలా మీడియం బడ్జెట్ సినిమాలు సైతం కేవలం పోస్టర్లకే పరిమితమయ్యాయి.
పోల్చుకోకూడదు కానీ తమిళ మలయాళం మేకర్స్ మనకంటే ఈ విషయంలో కొంచెం బెటర్ గా ఉన్నారు. అక్కడ సాలిడ్ అప్డేట్స్ అయితే కనిపించాయి. టాలీవుడ్ రిలీజ్ డేట్లు మార్చుకోవడాలు, వాయిదాలు, షూటింగ్ గ్యాపులు లాంటివి అనుకోకుండా జరుగుతాయి కాబట్టి ఏదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఫలానా పండగ వస్తుందని ముందుగా తెలిసినప్పుడు దానికి అనుగుణంగా ఏదైనా కంటెంట్ ఇవ్వాలనే దిశగా పెద్ద హీరోల దర్శక నిర్మాతలు ఆలోచన చేయకపోవడం విచారకరం.
వీటికే ఇలా ఉంటే ప్యాన్ వరల్డ్ మూవీస్ రేంజ్ లో మార్కెటింగ్ జరుగుతున్న వారణాసి, రాకా, డ్రాగన్, ఫౌజీ, స్పిరిట్ లాంటివి మౌనాన్నే ఆశ్రయించడం ఇంకో ట్రాజెడీ. ఏదైతేనేం ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటివి చవి చూడాల్సి వస్తుంది. ఈ ఏడాదిలో మిగిలిన రెండు నెలల్లో నెక్స్ట్ వచ్చే పండగ క్రిస్మస్ ఒకటే. అప్పుడు దాదా, కింగ్ 100 హడావిడి ఉంటుంది. సో తిరిగి సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. వృషకర్మ టైంలో ఎలాంటి ఫెస్టివల్ లేదు.
This post was last modified on November 8, 2026 7:27 pm
సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…
పోలవరం జిల్లాలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికలలో జనసేన పూర్తిగా ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రజలు జేజేలు…
ఒక మార్పు మనిషినే కాదు.. రాజకీయాలను కూడా మార్చేస్తుంది. అమరావతికి కట్టుబడి ఉంటామని.. అమరావతి రాజధానిని మార్చబోమని.. అసలు అమరావతి…
ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…
ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…
తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ…