సోషల్ మీడియాను హ్యాండిల్ చేసే విషయంలో అప్రమత్తత అత్యంత ముఖ్యం. కనిపించిన ప్రతి సందేశాన్నీ.. ఆకట్టుకునే మాటలతో ఆకర్షించే అమ్మాయిల స్వరాన్ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. లేకపోతే.. ప్రమాదం `మన చేతుల్లో` ఉన్నట్టే. ముఖ్యంగా ఇటీవల కాలంలో అత్యంత వినసొంపైన గళంతో యువతులు ఆకర్షిస్తున్నారు. “మీరు ఒంటరిగా ఉన్నారా? గళ్ ఫ్రెండ్ కావాలా? చాటింగ్ చేస్తారా? “ అంటూ.. ఆకర్షణీయంగా మాట్లాడుతూ.. ఆకట్టుకుంటున్నారు. ఒక్కసారి ఈ మాయలో పడ్డారంటే చాలు.. ఇక బ్యాంకు ఖాతాలు ఖాళీ కావాల్సిందే. మీరు ఇవ్వక్కర్లేదు.. మీ నుంచి సేకరించిన సమాచారంతో వారే దోచుకుంటారు.
ఈ తరహా మోసాలు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్నాయని కేంద్రం హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాల ద్వారా జరుగుతున్న మోసాలు ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, స్నేహం, ప్రేమ, పెళ్లి లేదా ఉద్యోగాల పేరుతో నమ్మించి భారీగా డబ్బు, బంగారం దోచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, కష్టాల్లో ఉన్నామని నమ్మించి బాధితుల ఇళ్లలోనే ఆశ్రయం పొందుతూ నగలు, నగదు దోచుకెళ్తున్న ఘటనలు సంచలనం రేపాయి. ఉదాహరణకు విశాఖపట్నం, హైదరాబాద్ పరిసరాల్లో గత రెండు రోజుల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి.
నకిలీ ఐడీలతో యువతీ యువకులకు దగ్గరై, అత్యవసర పరిస్థితులు లేదా వ్యాపార అవసరాల పేరుతో లక్షలాది రూపాయలు, క్రెడిట్ కార్డులు తీసుకుని పరారవుతున్నారు. మరో కీలక పరిణామం ఏంటంటే.. అమ్మాయిల ఫోటోలతో నకిలీ ఖాతాలు తెరిచి, అవతలి వారిని మాటల్లోకి దించి వ్యక్తిగత ఫోటోలు/వీడియోలు సేకరించి డబ్బుల కోసం వేధిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు (స్టాక్ మార్కెట్, క్రిప్టో) వస్తాయని లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
•
అలాగే, సెకండ్ హ్యాండ్ వాహనాలు, మొబైల్ ఫోన్లు లేదా ఇతర వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తున్నామంటూ అడ్వాన్స్ పేమెంట్ల పేరుతో మోసం చేస్తున్నారు. వీటికి సంబంధించి గత రెండు వారాల్లో 230 కేసులు ఇరు రాష్ట్రాల్లోనూ నమోదు కావడం గమనార్హం. సో.. నిజ జీవితంలో తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులకు డబ్బు పంపడం, బ్యాంక్ వివరాలు లేదా క్రెడిట్ కార్డులు ఇవ్వడం చేయకండి.
This post was last modified on November 26, 2026 3:16 pm
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…
భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…
వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…
ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో…
కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు…
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. సోషల్ మీడియాలో…